Begin typing your search above and press return to search.
జబ్ ప్రేక్షకులు మెట్ తలనొప్పి!!
By: Tupaki Desk | 5 Aug 2017 5:15 AM GMTఒక పేరున్న హాలీవుడ్ డైరెక్టర్ ఒకసారి ఒక మాట అన్నాడు “ఏ డైరెక్టర్ అయినా జీవితంలో ఒక్క సినిమా కథనే రాస్తాడు. ఆ ఒక్క సినిమాను డైరెక్ట్ చేసిన తరువాత చెప్పలేనివి ఇంకా బాగా చెప్పాలి అనుకుని.. తొందరలో మరిచిపోయేవి అందులో కలిపి.. మరో కథ గా మార్చి మార్చి.. అదే కథను కొత్తగా సినిమాగా తీస్తుంటాడు'' అని అన్నాడు. మరో గొప్ప నటుడు ఇంకో విషయం చెప్పాడు నటుడు అనేవాడు పాత్రలో పరకాయప్రవేశం చేస్తాడు స్టార్ అనే వాడు తనను ఏది అయితే స్టార్ ని చేసిందో దాన్నినే మళ్ళీ మళ్ళీ చూపడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఇది ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు ‘జబ్ హ్యారి మెట్ సెజల్’ హింది సినిమా చూస్తే ఈ రెండు గుర్తుకు వచ్చాయి.
ఇంతియాజ్ ఆలీ అంటే ప్రేమ ఉంటుంది కానీ పూర్తిగా ఎవరి ప్రేమ ఎంత అనేది అర్ధం కాదు. బలమైన పాత్రలు ఉంటాయి కానీ ఎవరి బలాలు ఏంటి అనేవి తెలియదు. ఒకరికి ఒకటి కావాలి అది ఏంటో తెలియదు. తనను తాను వెతుకుంటూ కావలిసిన వారిని కలుసుకుంటూ తన కథలు సాగుతూ ఉంటాయి. ఇప్పుడు విడుదలైన జబ్ హ్యారి మెట్ సెజల్ సినిమా కూడా తన ప్రతి సినిమా లాగానే ఈ సినిమాలో కూడా వెతకటంతో కథ మొదలు అవుతుంది. కాకపోతే ఈ సినిమాలో ఆ సెర్చింగ్ అంతా కూడా తలనొప్పిగా తయారై.. జబ్ ప్రేక్షకులు మెట్ తలనొప్పి అన్న చందంగా తయారైంది.
‘తమాషా’ సినిమాలో ఒక హీరో తను అవ్వాలి అనుకునే మనిషిలా మారడం కోసం వెతుకుతాడు, ‘హై వే’ లో ఆమెకు ఎప్పటికీ దక్కని స్వచ్చ మైన ప్రేమ కోసం వెతుకుతుంది, రాక్ స్టార్ - జబ్ వే మెట్ ఇలా తన సినిమాలు అన్నింటిలో ఒక ఎమోషన్ కోసం వెతికాడు. కానీ జబ్ హ్యారి మెట్ సెజల్ సినిమాలో రింగ్ కోసం వెతకడం మొదలుపెట్టి వీధుల్లో తిరగటం తప్పితే పాత్రలతో చెప్పింది ఏది లేదు . ఇంతియాజ్ ఆలీ ఈ సినిమాతో ఏమి చెప్పాలి అనుకున్నాడో అతినికే ఒక ఐడియా లేదని తెలుస్తుంది. షారూక్ ఖాన్ ఈ సినిమాలో తన చేసింది ఏమి లేదు. తన పాత కొన్ని ట్రేడ్ మార్క్ ఎమోషన్లు తప్పితే. అవే హావభావాలు అవే మాటలు కాకపోతే కొంచం జులాయి గా చెప్పాడంతే. ఇంకా అనుష్క శర్మా కూడా గుజరాతీ యాస తప్పితే కొత్తగా చేసి చూపించింది నథింగ్.
షారూక్ - అనుష్క - ఇంతియాజ్ ఆలీ కెరియర్ లోనే ఈ సినిమా ఒక పెద్ద ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ప్రేమకథలు అన్నీ ఇంచు మించు ఒకేలా ఉన్న ఏ ప్రేమ కథ ఒకటి కాదు. కానీ జబ్ హ్యారి మెట్ సెజల్ సినిమాలో షారూక్, అనుష్క శర్మల మధ్య ప్రేమ 20 ఏళ్ళ కిందట వచ్చిన కరణ్ జోహర్ - ఆదిత్య చోప్రా సినిమాలను ఇంతియాజ్ ఆలీ మళ్ళీ డైరెక్ట్ చేసినట్లు ఉంది అని చెబుతున్నారు.