Begin typing your search above and press return to search.
సముద్రంలో సైన్స్ ఫిక్షన్.. శంకర్ మరో ప్రయోగం!
By: Tupaki Desk | 7 Aug 2019 4:13 AM GMTసౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఏం చేసినా అందులో సంథింగ్ స్పెషాలిటీ ఉంటుంది. హాలీవుడ్ ని కొట్టేలా ఆయన ఆలోచనా శైలి సాగుతుంది. అందుకు తగ్గట్టే అతడికి భారీతనం నిండిన కథలు.. అసాధారణ బడ్జెట్లు అవసరం అవుతుంటాయి. ప్రస్తుతం ఆయన కమల్ హాసన్ కథానాయకుడిగా భారతీయుడు 2 తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఈ సినిమా సెట్స్ పై ఉండగానే శంకర్ నుంచి మరో ఆసక్తికర వార్త లీకైంది. `భారతీయుడు 2` తర్వాత శంకర్ మరో భారీ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది 2.0 చిత్రాన్ని మించిన భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం. అది కూడా సముద్రం నేపథ్యంలో కథాంశాన్ని ఎంచుకున్నారు. సముద్రంలో సూపర్ పవర్స్ ఉన్న ఒక భారీ అక్టోపస్ సామ్రాజ్యంలో ఏం జరిగింది? అన్న ఆసక్తికర కథాంశాన్ని ఎంచుకుని దీనిని 3డిలో వీఎఫ్ ఎక్స్ వండర్ గా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ని సంప్రదించారు. కానీ అతడు వేరే సినిమాలకు కమిటవ్వడంతో కాల్షీట్ల సమస్య తలెత్తింది. దీంతో శంకర్ ఆ పాత్ర కోసం కింగ్ ఖాన్ షారూక్ ని సంప్రదించారని తెలుస్తోంది.
షారూక్ శంకర్ ప్రపోజల్ కి ఓకే చెప్పారు. అతడితో పాటే తమిళ స్టార్ హీరో విజయ్ ఓ ముఖ్యమైన పాత్రలో నటించనున్నారు. అలాగే హాలీవుడ్ హీరో జాకీ చాన్.. చైనీ నటి లీ బింగ్ బింగ్ లను ఇతర ఆసక్తికర పాత్రల్లో నటించేందుకు ఒప్పించారని ప్రచారం సాగుతోంది. ఈ సినిమాకి షారూక్ అంగీకరించడానికి కారణం శంకర్ ఇదివరకూ 2.0 చిత్రాన్ని అత్యంత భారీగా తెరకెక్కించి మెప్పించడమేనని తెలుస్తోంది. 2.0 చిత్రంలో రజనీకాంత్ పాత్రకు ధీటుగా పక్షిరాజు పాత్రను డిజైన్ చేశారు. వీఎఫ్ ఎక్స్ మాయాజాలంతో ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానం నచ్చిందట. అందుకే ఇప్పుడు శంకర్ ఆఫర్ కి అంగీకరించారని తెలుస్తోంది. ఇదో భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం. బడ్జెట్ అదే స్థాయిలో ఉంటుంది కాబట్టి హాలీవుడ్ నిర్మాణ సంస్థల్ని సంప్రదిస్తున్నారట. అయితే 2.0 రిలీజ్ సమయంలోనే `ఆక్వామేన్` తరహాలో సముద్రాల బ్యాక్ డ్రాప్ లో భారీ చిత్రం తీయాలనుందని శంకర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. టెక్నికల్ వండర్స్ తీయాలనుకునే తనకు మీడియా నుంచి అండదండలు కావాలని కోరారు. ప్రస్తుతం మరో భారీ ప్రయోగానికి అతడు ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. జాతీయ మీడియాలో కొన్ని కథనాలు వెలువడ్డాయి.