Begin typing your search above and press return to search.
ఆఫ్రికాలో సూపర్ స్టార్ యుద్దం!!
By: Tupaki Desk | 10 May 2017 6:30 AM GMTఎవరేం చెప్పినా కూడా.. ఎప్పుడూ మూస సినిమాలను చేయడమే పనిగా పెట్టుకున్నాడు షారూఖ్ ఖాన్. మనోడు ఎంతపెద్ద సూపర్ స్టార్ అయినప్పటికీ.. దిల్ వాలే అండ్ హ్యాపీ న్యూ ఇయర్ వంటి సినిమాలను చూశాక ఈయనపై రెస్పెక్ట్ సన్నగిల్లిందనే చెప్పాలి. అలాంటి మూస కంటెంట్ సినిమాలను ఇంకెంత కాలం చేస్తాడో నాయనో అని జనాలు అనుకుంటున్న సమయంలో.. ఫ్యాన్ అండ్ రయీస్ సినిమాలతో వచ్చాడు. వాటిలో కూడా లుక్ అండ్ ఫీల్ కొత్తగా ఉందే కాని.. కంటెంట్ మాత్రం రొటీన్ మసాలానే.
ఒక ప్రక్కన ఇతర ఖాన్స్ అయిన సల్మాన్ అండ్ అమీర్ లు.. కాస్త కొత్తగా ఉండే భజరంగీ బాయిజాన్ లు.. దంగల్ లు తీస్తుంటే.. మనోడు మాత్రం ఈ రొటీన్ కంటెంట్ తో రేసులో వెనుకబడ్డాడు. అందుకే ఇప్పుడు కొత్తగా ప్రయత్నించడం కోసం ఒక రియలిస్టిక్ మిలటరీ సినిమాను తీయాలని అనుకుంటున్నాడట. మొన్నటివరకు అక్షయ్ కుమార్ ఎత్తుకున్న సబ్జెక్టులను ఇప్పుడు షారూఖ్ చేద్దాం అనుకుంటున్నాడు. ఒక వార్ సినిమాలో సైనికుడుగా కనిపించాలని తహతహలాడుతున్నాడు.
2000వ సంవత్సరంలో ఆఫ్రికన్ కంట్రీ అయిన సియరా లియాన్ లో సివిల్ వార్ సంభవించింది. రివ్యులషనరీ యునైటడ్ ఫ్రంట్ అనే టెర్రర్ గ్రూపులో దేశ సైనికులపై యుద్దం ప్రకటించింది. ఆ సమయంలో టెర్రరిస్టు గ్యాంగులను కంట్రోల్ చేయడానికి భారత సైనికులను వైమానిక దళంతో కూడిన ఒక ప్రత్యేక దళాన్ని ఐక్యరాజ్యసమితి అక్కడకు పంపగా.. చాలామంది సైనికులను టెర్రరిస్టులు కిడ్నాప్ చేశారు. అప్పుడు మనోళ్ళు వీరోచితంగా పోరాడి అందరినీ విడిపించడమే కాకుండా.. సియారా లియోన్ దేశానికి పట్టిన చీడను కూడా తొలగించారు. దీనినే ''ఆపరేషన్ ఖుక్రీ'' అంటారు. ఈ నేపథ్యంలో షారూఖ్ సినిమా చేయబోతున్నాడట. మనోడు ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలుస్తోంది.
ఈ మధ్య కాలంలో కువైట్ వార్ నేపథ్యంలో అక్షయ్ కుమార్ ''ఎయిర్ లిఫ్ట్'' సినిమా చేయగా.. 1965 ఇండోచైనా వార్ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ''ట్యూబ్ లైట్'' సినిమాతో వస్తున్నాడు. ఇప్పుడు షారూఖ్ ఖాన్ కూడా ఈ లిస్టులో చేరతాడనమాట.