Begin typing your search above and press return to search.

ఓటింగ్ కి.. బోటింగ్ కి తేడా తెలియ‌ని బాద్షా కొడుకు!

By:  Tupaki Desk   |   30 April 2019 7:57 AM GMT
ఓటింగ్ కి.. బోటింగ్ కి తేడా తెలియ‌ని బాద్షా కొడుకు!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. ఓటింగ్ వేసేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ఓటేయ‌టానికి ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న వైనం తెలిసిందే. తాము ఓటు వేయ‌ట‌మే కాదు.. ప్ర‌జ‌ల్ని కూడా ఓటు వేయాల‌ని కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ బాద్షా తాజాగా త‌న చిన్న కొడుకు అబ్రామ్ ను తీసుకొని పోలింగ్ కేంద్రానికి వ‌చ్చిన వైనం ప‌లువురి దృష్టిని ఆక‌ర్షించింది.

అంత చిన్నోడైన అబ్రామ్ ను షారుక్ పోలింగ్ కేంద్రానికి ఎందుకు తీసుకొచ్చిన‌ట్లు? అన్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర స‌మాధాన్ని ఇచ్చారాయ‌న‌. త‌న కొడుక్కి బోటింగ్ కు.. ఓటింగ్ కి తేడా తెలియ‌టం లేద‌ని.. ఆ రెండు ప‌దాల్ని వాడే విష‌యంలో క‌న్ఫ్యూజ్ అవుతున్నాడ‌ని భావించి తాను పోలింగ్ బూత్ కు తీసుకొచ్చిన‌ట్లు చెప్పారు. పోలింగ్ బూత్ వ‌ద్ద‌కు తీసుకెళ్లి.. త‌న కొడుక్కి వివ‌రంగా చెప్పిన‌ట్లు తెలిపారు.

త‌న కొడుక్కి పోలింగ్ కేంద్రం గురించి అర్థ‌మ‌య్యేలా చెప్ప‌టానికి చాలా స‌మ‌యం తీసుకున్న‌ట్లు చెప్పిన షారూక్.. పోలింగ్ బూత్ ద‌గ్గ‌ర త‌న కొడుకుతో దిగిన ఫోటోను అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ ఫోటోకు పెద్ద ఎత్తున లైక్స్ రావ‌టం గ‌మ‌నార్హం. జీరో ప‌రాజ‌యం త‌ర్వాత ఎలాంటి సినిమాలు చేయాల‌నుకోవ‌టం లేద‌ని చెప్పిన షారూక్.. పిల్ల‌ల‌తో గ‌డుపుతున్నారు. ఇదిలా ఉంటే.. షారుక్ ఫోటోను ప్ర‌శంసిస్తూ ప‌లువురు కామెంట్లు పెడుతున్నారు. చిన్న త‌నం నుంచే పిల్ల‌ల‌కు ముఖ్య‌మైన విష‌యాల్ని నేర్పిస్తున్నారంటూ మెచ్చుకుంటున్నారు.