Begin typing your search above and press return to search.
హాట్ టాపిక్ గా మారిన షారుఖ్ సినిమా ఓటీటీ, శాటిలైట్ డీల్!
By: Tupaki Desk | 26 Sep 2022 9:37 AM GMTబాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సినిమా విడుదలై దాదాపు నాలుగేళ్లు కావస్తోంది. ఎప్నుడెప్పడు బిగ్ స్క్రీన్ పై కింగ్ ఖాన్ ని చూడాలా? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 2018లో ఆనంద్ ఎల్. రాయ్ రూపొందించిన రొమాంటిక్ రామెడీ డ్రామా 'జీరో' డిజాస్టర్ కావడంతో తీవ్ర షాక్ కు గురైన షారుఖ్ ఖాన్ అప్పటి నుంచి మంచి కథల కోసం అన్వేషించడం మొదలు పెట్టారు. ఎట్టకేలకు మూడు క్రేజీ ప్రాజెక్ట్ లకు పచ్చ జెండా ఊపిన విషయం తెలిసిందే.
ముందుగా 'పఠాన్' ని మొదలు పెట్టిన షారుఖ్ ఖాన్ తొలిసారి దక్షిణాది దర్శకుడు అట్లీ కుమార్ తో 'జవాన్' పేరుతో మరో భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ భారీ యాక్షన్ డ్రామాని గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు.
ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ లుక్, గ్లింప్స్ ని విడుదల చేశారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తుండగా కీలక అతిథి పాత్రల్లో తమిళ స్టార్ దళపతి విజయ్, బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దిపికా పదుకోన్ నటిస్తున్నారు.
ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్ని ఈమూవీని 2023 జూన్ 2న భారీ స్థాయిలో హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో వున్న ఈ మూవీ ప్రి రిలీజ్ బిజినెస్, శాటిలైట్, ఓటీటీ బిజినెస్ ల పరంగా రికార్డు సృష్టించినట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడిందని తెలుస్తోంది. అంతే కాకుండా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల్ని రికార్డు స్థాయి మొత్తానికి సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ అన్ని భాషలకు కలిపి రూ. 180 కోట్లు చెల్లించినట్టుగా తెలుస్తోంది. ఇక శాటిలైట్ హక్కుల విషయంలోనూ షారుఖ్ మూవీ రికార్డు సృష్టించిందట. శాటిలైట్ రైట్స్ ని జీ టీవి రూ. 70 కోట్లకు సొంతం చేసుకున్నట్టుగా చెబుతున్నారు. అంటే ఈ రెండు హక్కులకు గానూ రూ. 250 కోట్లు 'జవాన్' మేకర్స్ సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత కూడా షారుఖ్ సినిమాకు ఈ రేంజ్ లో ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ జరగడం విశేషంగా చెబుతున్నారు.
ఇదే ఇలా వుంటే థియేట్రికల్ రైట్స్ రూపంలో కూడా భారీగానే దక్కించుకునే అవకాశం వుందని బాలీవుడ్ వర్గాల టాక్. ఓటీటీ, శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ మొత్తం కలిసి రూ. 500 కోట్లు అయినా ఆశ్చర్యం లేదన్నది ట్రేడ్ వర్గాల అంచనా.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.