Begin typing your search above and press return to search.
కింగ్ ఖాన్ ఫైన్ కట్టాడండోయ్
By: Tupaki Desk | 12 Feb 2016 1:02 PM GMTచట్టం ముందు అందరూ సమానమే అంటారు కానీ.. సెలబ్రెటీలు కొంచెం తక్కువ సమానం. వాళ్ల అక్రమ వ్యవహారాల్ని చూసీ చూడనట్లు వదిలేస్తుంటారు అధికారులు. ఐతే ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం షారుఖ్ అక్రమ వ్యవహారాన్ని అంత తేలిగ్గా తీసుకోలేదు. నిబంధనల్ని అతిక్రమించినందుకు అతడికి రూ. 1,93,784 జరిమానా విధించారు. ఆ మొత్తం అతడి నుంచి వసూలు చేశారు. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రభుత్వ స్థలాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా సొంత ప్రజయోజనాలకు వాడుకోవడమే షారుఖ్ చేసిన నేరం. బంద్రాలోని తన నివాసం ‘మన్నత్ ముందు షారుఖ్ అక్రమంగా ఓ ర్యాంప్ నిర్మించాడు. దీనిపై పెద్ద వివాదమే నెలకొంది. మీడియాలో వార్తలు రావడంతో అధికారులు దాన్ని కూలగొట్టారు. తర్వాత షారుఖ్ కు జరిమానా కూడా వేశారు. ఈ ఫైన్ సంగతి సమాచార హక్కు చట్టం ద్వారా అనిల్ అనే వ్యక్తి బయటపెట్టాడు. ఐతే మీడియా షారుఖ్ అక్రమాన్ని బయటపెట్టి వివాదం చేసింది కాబట్టి.. ఈ వ్యవహారం బయటికి వచ్చింది కానీ.. లేకుంటే అధికారులు మాత్రం దీన్ని పట్టించుకునేవారా అసలు?