Begin typing your search above and press return to search.

23 ఏళ్ల షారూక్ తో డీడీ సర్కస్

By:  Tupaki Desk   |   15 Feb 2017 5:44 AM GMT
23 ఏళ్ల షారూక్ తో డీడీ సర్కస్
X
షారూక్ ఖాన్ ఏజ్ ప్రస్తుతం 50+ కదా.. మరి 23 ఏళ్ల షారూక్ ఖాన్ ఏంటి అనే ప్రశ్న తలెత్తడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు వింటున్నది మాత్రం నిజమే. త్వరలో డీడీలో ప్రసారం కానున్న ఓ టెలివిజన్ షోలో.. 23 ఏళ్ల వయసున్న కింగ్ ఖాన్ దర్శనం ఇవ్వబోతున్నాడు.

ఫ్యాన్ మూవీలో అభిమాని పాత్ర కోసం చేసినట్లుగా.. టీవీ సిరీస్ కోసం కూడా షారూక్ ఖాన్ మేకోవర్ చేసేస్తున్నాడని అనుకోకండి. ఇది నిజంగానే షారూక్ ఖాన్ కు 23 ఏళ్ల వయసు ఉన్నపుడు తీసిన సిరీస్. సినిమాల్లోకి రాకముందు.. షారూక్ బుల్లితెరపై నటించాడు.. యాంకరింగ్ తో పాటు కొన్ని కార్యక్రమాల్లో యాక్టింగ్ కూడా చేశాడు. అలాంటిదే.. 1989లో ప్రసారమైన సర్కస్ అనే సిరీస్.

ఇప్పుడీ సర్కస్ ను మళ్లీ టెలికాస్ట్ చేయాలని డిసైడ్ అయింది డీడీ నేషనల్. అప్పట్లో ఈ సిరీస్ సూపర్ సెన్సేషనల్. వేరే ఛానల్స్ తో పోటీ కూడా ఉండేది కాదు కాబట్టి.. టీఆర్పీల గోల లేదులే. అదలా ఉంటే ఈ నెల 19 నుంచి ప్రారంభించి.. రాత్రి 8 గంటలకు షారూక్ తన తొలినాళ్లలో నటించిన సర్కస్ ను రీ టెలికాస్ట్ చేయబోతోంది డీడీ. మరి 23 ఏళ్ల వయసులో షారూక్ ఖాన్ ఏ రేంజ్ లో ఇరగదీశాడో చూసే భాగ్యం.. ఆడియన్స్ కు దక్కేందుకు మరో నాలుగు రోజులే గ్యాప్ ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/