Begin typing your search above and press return to search.

మా అత్త అలా అనడం వల్ల మన్నత్‌ కొన్నాను

By:  Tupaki Desk   |   3 Jan 2019 1:30 AM GMT
మా అత్త అలా అనడం వల్ల మన్నత్‌ కొన్నాను
X
బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ ముంబయిలో నివాసం ఉండే మన్నత్‌ భవనంకు చాలా పేరుంది. ముంబయిలోనే కాదు, ఇండియాలోనే అతి పెద్ద భవనాల జాబితాలో ఇది ఉంటుంది. హీరో అయిన కొత్తలో షారుఖ్‌ ఖాన్‌ ఒక ఖరీదైన అపార్ట్‌ మెంట్‌ లో ఉండేవాడట. పెళ్లి తర్వాత భార్య గౌరీతో ఆ అపార్ట్‌ మెంట్‌ లో కాపురం పెట్టాడట. అయితే దిల్లీకి చెందిన వారు ఎక్కువ శాతం సొంత భవనాలను కలిగి ఉంటారు. గౌరీ వాళ్ల అమ్మగారు - మా అత్తగారు ముంబయికి వచ్చిన ప్రతి సారి ఈ ఇరుకు అపార్ట్‌ మెంట్‌ లో ఎలా ఉంటున్నారు అంటూ ప్రశ్నించేది. ఆమె పదే పదే అలా అనడంతో మన్నత్‌ భవనంను కొన్నాను.

మన్నత్‌ ను నేను కొనుగోలు చేసిన సమయంలో ఖరీదు కాస్త తక్కువే. కాని ఇప్పుడు మన్నత్‌ విలువ రెండు వందల కోట్లకు పైగా ఉంటుందట. షారుఖ్‌ హీరో అయ్యాక - పెళ్లి అయ్యాక ఎన్నో ఆస్తులను కొనుగోలు చేశాడట. కాని అవేవి కూడా మన్నత్‌ కు సమానం కాలేక పోయాయట. షారుఖ్‌ కొన్న వాటిలో అన్నింటి కన్న ఎక్కువ ఖరీదైనది మన్నత్‌. చాలా విశాలంగా - సముద్రంకు ఎదురుగా ఉండటంతో పాటు - అత్యంత అహ్లాదకరమైన వాతావరణం మన్నత్‌ సొంతం.

షారుఖ్‌ తన ప్రతి పుట్టిన రోజు సందర్బంగా మన్నత్‌ ముందు భారీ ఎత్తున అభిమానులు గుమ్మి గూడుతారు. వారికి షారుఖ్‌ బాల్కానీలోకి వచ్చి అభివాదం చేస్తాడు. మన్నత్‌ తనకు అదృష్టంను కూడా తీసుకు వచ్చిందని షారుఖ్‌ అంటూ ఉంటాడు. తన అత్త వల్లే అత్యంత ఖరీదైన మన్నత్‌ ను కొనుగోలు చేశానంటూ షారుఖ్‌ చెప్పుకొస్తున్నాడు.

షారుఖ్‌ నటించిన సినిమాలు గత కొంత కాలంగా నిరాశ పర్చుతూ వస్తున్నాయి. తాజాగా నటించిన ‘జీరో’ సినిమా కూడా జీరోగా నిలిచింది. అయినా కూడా షారుఖ్‌ ను ఆయన అభిమానులు తక్కువ అంచనా వేయడం లేదు. ఎప్పుడో ఒకప్పుడు షారుఖ్‌ మళ్లీ గట్టిగా కొట్టడం ఖాయం అంటూ అభిమానులు నమ్మకంతో ఉన్నారు.