Begin typing your search above and press return to search.

మనవడి రూమర్ పై షారూక్ రియాక్షన్

By:  Tupaki Desk   |   13 May 2017 4:28 AM GMT
మనవడి రూమర్ పై షారూక్ రియాక్షన్
X
ఎంతటి సూపర్ స్టార్ లు అయినా రూమర్స్ బారిన పడాల్సిందే. రకరకాల కామెంట్స్ కు ఇబ్బంది పడాల్సిందే. కాకపోతే చాలావరకు గాసిప్స్ వీరు స్పందించరు అంతే. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ ఫ్యామిలీపై ఓ దారుణమైన రూమర్ ఉంది. అదేంటంటే.. చిన్న కొడుకు అబ్రామ్.. నిజానికి షారూక్ కుమారుడు కాదు.. పెద్ద కొడుకు ఆర్యన్ ప్రేమకు ప్రతిరూపం అనేది ఆ రూమర్ సారాంశం. అంటే మనవడినే షారూక్ మూడో కొడుకుగా చెప్పాడని అన్నారన్న మాట.

దీనిపై కింగ్ ఖాన్ కానీ.. ఆయన ఫ్యామిలీ కానీ ఎప్పుడూ రియాక్ట్ కాలేదు. కానీ తొలిసారిగా ఈ టాపిక్ స్పందించాడు షారూక్. టెడ్ టాక్ 2017 స్పీచ్ లో షారూక్ ఖాన్ మాట్లాడాడు. 'నాలుగేళ్ల క్రితం నేను.. నా భార్య గౌరి మూడో బిడ్డ గురించి నిర్ణయం తీసుకున్నాం. అయితే.. ఈ బిడ్డ నా పెద్ద కొడుకు ఆర్యన్ లవ్ చైల్డ్ అంటూ ఇంటర్నెట్ లో ప్రచారం జరిగింది. దీనిపై ఓ ఫేక్ వీడియో కూడా చక్కర్లు కొట్టింది. రొమేనియా గాళ్ ఫ్రెండ్ తో 15 ఏళ్ల ఆర్యన్ కు సంబంధం ఉందని రూమర్స్ వచ్చాయి. ఆ సమయంలో నా కుటుంబం ఎంతో డిస్టర్బ్ అయింది' అన్నాడు షారూక్.

'ఇప్పుడు ఆర్యన్ కు 19 ఏళ్ల వయసు వచ్చింది. ఇప్పటికీ ఎవరైనా సరే హలో అని పలకరించగానే.. "నాకు యూరోప్ లో డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు" అని సమాధానం చెబుతుంటాడు' అని చెప్పాడు షారూక్ ఖాన్. పైకి చెప్పకపోయినా.. కింగ్ ఖాన్ ఫ్యామిలీ ఈ రూమర్ కారణంగా మానసికంగా ఎంతగా ఇబ్బంది పడిందో అర్ధమవుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/