Begin typing your search above and press return to search.
బాలీవుడ్ లో తెగ సంపాయిస్తోంది వీళ్లేనంట!
By: Tupaki Desk | 23 Aug 2017 9:22 AM GMTవందల కోట్లతో నిర్మిస్తున్న మూవీల్లో హీరోలుగా చేస్తున్న వారిలో దేశంలో ముగ్గురే ముగ్గురు అందరికన్నా బాగా సంపాయిస్తున్నారని తెలిసిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ లో తమకంటూ ఓస్టేజ్‌ను ఏర్పాటు చేసుకున్న వీరంతా.. తెగ సంపాయిస్తున్నారని స్పష్టమైంది. అంతేకాదు. ప్రపంచంలోని భారీ సంపాదన పరులతో పోలిస్తే.. మన దేశం నుంచి వీరి ముగ్గరు పేర్లే వినిపిస్తున్నాయి. వారే.. సల్మాన్ ఖాన్ - షారుఖ్ ఖాన్ - అక్షయ్ కుమార్ లు. వీరు ముగ్గురు ప్రపంచంలో బాగా సంపాయించుకుంటున్న వారి జాబితాలో చోటు దక్కించుకున్నారట. ఈ వివరాలను ప్రపంచ ప్రఖ్యాత మేగజైన్ ఫోర్బ్స్ తాజాగా వెల్లడించింది.
ఏటా వివిధ రంగాల్లో బాగా సంపాయిస్తున్న సెలబ్రిటీల వివరాలు సేకరించే ఈ పత్రిక.. తాజాగా సినీ ఫీల్డ్ లో అందునా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ రంగంలో ఎవరెవరు బాగా సంపాయించి వెనుకేసుకుంటున్నారో లెక్కగట్టింది. ఈ అంచనా ప్రకారం, ఓ జాబితాను విడుదల చేసింది. 2016 జూన్ 1 నుండి 2017 జూన్ 1 మధ్య కాలంలో సేకరించిన వివరాలను బేస్ చేసుకుని ఈ జాబితా రూపొందించినట్టు తెలిపింది. దీనిలో టాప్ 10 లో మన ఇండియన్ స్టార్స్ ముగ్గురు ఉండటం గమనార్హం. ముందు ఈ ముగ్గురి వివరాలు చూద్దాం..
సల్మాన్ ఖాన్ః బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ 37 మిలియన్ డాలర్ల సంపాదనతో ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానంలో ఉన్నారు. సల్మాన్ ఖాన్ సంపాదన రూ. 237 కోట్లని పత్రిక వివరించింది.
అక్షయ్ కుమార్ః మరో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ 35.5 మిలియన్ డాలర్ల సంపాదనతో 10వ స్థానంలో ఉన్నారట. అక్షయ్ సంపాదన రూ. 227.5 కోట్ల రూపాయలుగా ఫోర్బ్స్ తేల్చింది.
షారుక్ ఖాన్ః ఇండియన్ స్టార్ షారుక్ ఖాన్ 38 మిలియన్ డాలర్ల సంపాదనతో 8వ స్థానంలో ఉన్నారని ఫోర్బ్స్ వెల్లడించింది. షారుక్ సంపాదన రూ. 243.5 కోట్లుగా ఉందని పేర్కొంది.
ఇక హాలీవుడ్ తారల విషయానికి వస్తే..
మార్క్ వాబర్గ్ః హాలీవుడ్ స్టార్ మార్క్ వాబర్గ్ 68 మిలియన్ డాలర్ల సంపాదనతో ఈ ఏడాది నెం.1 స్థానంలో నిలిచాడు. మన కరెన్సీ ప్రకారం అతడి సంపాదన ఏడాదికి రూ. 435 కోట్లు.
డ్వేన్ జాన్సన్ః హలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్ 65 మిలియన్ డాలర్ల సంపాదనతో రెండో స్థానంలో ఉన్నాడు. మన కరెన్సీ లెక్కల ప్రకారం అతడి సంపాదన రూ. 416 కోట్లు. ఇతనితో కలిసి మన ప్రియాంక చోప్రా బేవాచ్ అనే హాలీవుడ్ సినిమాలో నటించింది.
విన్ డీసెల్ః హాలీవుడ్ స్టార్ విన్ డీసెల్ 54.5 మిలియన్ డాలర్ల సంపాదనతో 3వ స్థానంలో ఉన్నాడు. మన కరెన్సీ ప్రకారం రూ. 349 కోట్లు. ఇతడిగా సినిమా ద్వారానే దీపిక పదుకోన్ హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చన సంగతి తెలిసిందే.
ఆడమ్ సాండ్లర్ః హాలీవుడ్ నటుడు ఆడమ్ సాండ్లర్ సంపాదన సంవత్సరానికి 50.5 మిలియన్ డాలర్లు. మన కరెన్సీ లెక్క ప్రకారం రూ. 323 కోట్లు.
జాకీ చాన్ః అంతర్జాతీయ నటుడు జాకీ చాన్ సంపాదన సంపాదన సంవత్సరానికి 49 మిలియన్ డాలర్లు. మన కరెన్సీ లెక్క ప్రకారం రూ. 314 కోట్లు.
రాబర్ట్ డౌనీః జూనియర్ ఐరన్ మ్యాన్ స్టార్ రాబర్ట్ డౌనీ జూనియర్ ఈ ఏడాది సంపాదన 48 మిలియన్ డాలర్లు. మన కరెన్సీ లెక్క ప్రకారం రూ. 307 కోట్లు.
టామ్ క్రూయిజ్ః హాలీవుడ్ స్టార్ టామ్ క్రూయిజ్ సంపాదన 43 మిలియన్ డాలర్లు. మన కరెన్సీ లెక్క ప్రకారం రూ. 275 కోట్లు.