Begin typing your search above and press return to search.

షారూక్.. పిల్లలూ.. మహాభారతం

By:  Tupaki Desk   |   27 Jun 2017 7:42 AM GMT
షారూక్.. పిల్లలూ.. మహాభారతం
X
బాలీవుడ్ కింగ్ ఖాన్ తన తెలివైన మాటలతో మీడియాను ఎప్పటికిప్పుడు తనవైపు తిప్పుకుంటాడు అనడంకన్నా షారూక్ తెలివిని అందుకోవడానికి మీడియా తన చుట్టూ తిరిగుతుంది అని కూడా అనుకోవచ్చు. కొద్ది కాలం కిందట నాకు మహాభారతం సినిమా చేయాలని ఉంది నాకు మహాభారతంలో కథలు చాలా ఇష్టం అని చెప్పాడు. గత ఏడాదిన్నర నుండి నేను మహాభారతాన్ని చదువుతున్నాను అని కూడా చెప్పాడు ఒక మీడియా సమావేశంలో. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ చేశాడు.

రంజాన్ పండుగ జరుపుకున్నాక షారూక్ మీడియా తో అతని పిల్లలు గురించి చెబుతూ ఈమధ్య తన కూతురు పై మీడియా చూపిస్తున్న ఉత్సాహంకు బ్రేక్ వేశాడు. ఈసారి అబ్రామ్ గురించి చెప్పాడు. ''నేను మహాభారతం చదివి నా చిన్న కొడుకు అబ్రమ్ కు చెబుతుంటాను. ఇస్లాంలో కూడా ఉన్న మంచిని మా పిల్లలకు కథలు రూపంలో చెబుతాను. వాళ్ళు కూడా మాలాగే ఇతర మతాలలో ఉన్న మంచిని తీసుకొని ప్రతి మతాన్ని - పక్కవాళ్ళ నమ్మకాలను గౌరవిస్తారని ఆశిస్తున్నాను. ప్రతి మతం చాలా గొప్పదని అందులో ఉన్న ఆంతర్యం గ్రహించి జీవితాన్ని అందంగా మార్చుకోవాలి'' అని చెప్పాడు.

''నా ఇంటిలో అందరూ కనీసం డిగ్రీ చదివి ఉండాలి. నా పిల్లలు అయినా సరే డిగ్రీ లేకపోతే ఇంట్లో చోటు ఉండదు. సుహానా డిగ్రీ పూర్తి కావడానికి చాల సమయం పడుతుంది. ఆర్యన్ కూడా మరో నాలుగు ఏళ్ళు పడుతుంది అతని చదువు పూర్తి కావడానికి. వాళ్ళు తరుచుగా మీడియా ముందుకు వస్తున్నారు అంటే దాని అర్ధం తొందరలో హీరో హీరోయిన్ అయిపోతారు అని కాదు'' అంటూ సెలవిచ్చాడు. ఒకవేళ సుహానా నటి కావాలనే అనుకున్నట్లుయితే ఆమెకు ముందు నటనలో పూర్తి శిక్షణ ఇప్పిస్తాను అని చెప్పాడు షారూఖ్.

ఇంతియాజ్ ఆలీ డైరక్షన్లో వస్తున్న ‘జాబ్ హ్యారి మెట్ సెజల్’ సినిమాలో షారూక్ నటిస్తున్నాడు. షారూక్ ఖాన్కు జంటగా అనుష్క శర్మా నటిస్తుంది. ప్రీతమ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఆగష్టు లో ఈ సినిమా విడుదల కాబోతుంది. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/