Begin typing your search above and press return to search.
హీరో తనయుడికి శిక్ష పడక పోవచ్చు
By: Tupaki Desk | 8 Oct 2021 6:40 AM GMTబాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. ఆర్యన్ ను ఎన్ సీ బీ అధికారులు క్రూజ్ షిప్ లో పట్టుకున్నారు. ఆ సమయంలో ఆయన వద్ద డ్రగ్స్ లేవని అన్నారు. కాని డ్రగ్స్ ఉన్న వ్యక్తితో ఆ సమయంలో మాట్లాడుతున్నట్లుగా అధికారులు చెప్పుకొచ్చారు. డ్రగ్స్ తీసుకున్నట్లుగా కూడా ఆర్యన్ కనిపించలేదు. ఆర్యన్ ఆ సమయంలో డ్రగ్స్ ను తీసుకోలేదు అంటూ చాలా మంది బలంగా వాదిస్తున్నారు. ఈ కేసు విచారణ తాజాగా జరిగింది. ఆర్యన్ తరపు న్యాయవాది బలంగా ఆర్యన్ నిర్దోశి అంటూ వాదించారట. అదే సమయంలో ఆర్యన్ కూడా తనను తాను నిర్దోశిగా కోర్టుకు చెప్పుకునేందుకు ప్రయత్నించాడట. ఈ విషయంలో ఆర్యన్ ను జనాలు నమ్మే విధంగా విచారణ జరిగిందని ముంబయి మీడియా వర్గాల వారు అంటున్నారు.
క్రూజ్ షిప్ పార్టీలో తనను బాలీవుడ్ సెలబ్రెటీ అనే ఉద్దేశ్యంతో మున్ మున్ ధమేచా ఆహ్వానించాడు. గ్లామర్ కోసం పిలిచాడు కాబట్టి వెళ్లాలని అనుకున్నాను. వారి ఆహ్వానం అందిన తర్వాతే నేను వెళ్లాను. అయితే ఆ పార్టీకి నా స్నేహితుడు అర్బాజ్ మర్చెంట్ వస్తున్నట్లుగా నాకు తెలియదు. అతడిని షిప్ బయట కలిశాను. అప్పుడే అక్కడ అతడిని చూసి ఆశ్చర్యపోయి మాట్లాడుతూ ఉన్నాను. ఆ సమయంలోనే ఎన్ సీ బీ అధికారులు అక్కడకు వచ్చారు. అర్బాజ్ వద్ద డ్రగ్స్ దొరకడంతో అక్కడే అతడితో మాట్లాడుతున్నందుకు గాను నన్ను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో నా వద్ద డ్రగ్స్ లేవు.. అర్బాజ్ వద్ద డ్రగ్స్ ఉన్న విషయం కూడా నాకు తెలియదు. అసలు అతడిని నేను అక్కడకు రమ్మనలేదు. అర్బాజ్ నా స్నేహితుడు అనేది వాస్తవం కాని అతడి వద్ద ఉన్న డ్రగ్స్ కు నాకు సంబంధం లేదు అంటూ ఆర్యన్ బలంగా వాదించాడట.
ఆర్యన్ వాదనలో నిజం ఉందని బాలీవుడ్ మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఎన్ సీ బీ అధికారులు కూడా అక్కడ ఆర్యన్ ను పట్టుకున్న మాట వాస్తవమే కాని.. అతడి వద్ద డ్రగ్స్ ను పట్టుకోలేదు.. అతడు డ్రగ్స్ తీసుకున్నట్లుగా లేడు అన్నారు. కనుక ఈ కేసులో ఆర్యన్ కు శిక్ష పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటూ న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఆర్యన్ ఇంకా కోర్టులో నా మొబైల్ ఫోన్ రెండు రోజులుగా అధికారుల వద్దే ఉంది. ఆ ఫోన్ లో నేను చేసిన చాట్ తో పార్టీకి వెళ్లిన విషయం.. అక్కడ అర్బాజ్ కాకతాళీయంగా కలిసిన విషయం ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. డ్రగ్స్ కేసులో నన్ను అరెస్ట్ చేయడం దారుణం అన్నట్లుగా ఆర్యన్ కోర్టులో ఆవేదన వ్యక్తం చేశాడట. మరి ఈ కేసులో ఆర్యన్ కు ఎలాంటి తీర్పు వస్తుంది అనేది దేశ వ్యాప్తంగా సినీ జనాలు మరియు సినీ ప్రేమికులు వెయిట్ చేస్తున్నారు.
--