Begin typing your search above and press return to search.

షారుఖ్ ఖాన్ బిడ్డకు విడుదల.. వాళ్ల ఇంటి ముందు పండుగ

By:  Tupaki Desk   |   29 Oct 2021 5:37 AM GMT
షారుఖ్ ఖాన్ బిడ్డకు విడుదల.. వాళ్ల ఇంటి ముందు పండుగ
X
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కోరిక నెరవేరింది. 25 రోజులుగా జైల్లో ఉంటున్న ఆయన కుమారుడికి విముక్తి లభించింది. ఆర్యన్ ఖాన్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న ఆర్యన్ ను ఎన్సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కింది కోర్టులన్నీ కూడా ఆర్యన్ కు బెయిల్ మంజూరు చేయలేదు. నెలరోజులుగా బెయిల్ కోసం అటు షారుఖ్ ఖాన్, లాయర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎన్సీబీ ఏవేవో కారణాలు చెప్పి బెయిల్ ను అడ్డుకుంటోంది.

గురువారం విచారణ అనంతరం బాంబే హైకోర్టు ఆర్యన్ ఖాన్ తోపాటు అర్బాజ్ మర్చంట్, మూన్ మూన్ ధమేచాలకు బెయిల్ మంజూరు చేసింది.దీంతో దాదాపు 20 రోజులకు పైగా జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది.

ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ పై బాంబే హైకోర్టులో మూడు రోజుల నుంచి సుధీర్ఘ వాదనలు కొనసాగాయి. ఆర్యన్ ఖాన్ తరుఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించి బెయిల్ వచ్చేలా చేశారు. ముకుల్ రోహత్గీ బలమైన అంశాలను లేవనెత్తడంతోనే ఎన్సీబీ వాదన వీగిపోయి బెయిల్ వచ్చింది. లాజిక్ తో ముకుల్ రోహత్గీ కొట్టేశాడు.

డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అక్టోబర్ 3న అరెస్టు చేసిన షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో షారుఖ్ ఖాన్ నివాసం ‘మన్నత్’ ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొంది. షారుఖ్ ఖాన్ అభిమానులు కోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు. షారుఖ్ ఖాన్ బంగ్లా మన్నాత్ వెలుపల గుమిగూడి కుటుంబానికి మద్దతుగా పండుగ చేసుకుంటున్నారు.