Begin typing your search above and press return to search.
పనివ్వమంటున్న మెగాస్టార్లు
By: Tupaki Desk | 9 March 2019 11:04 AM GMTమనకు చిరంజీవి ఒక్కడే మెగాస్టార్ కానీ మొత్తం భారతదేశంలో తీసుకుంటే చిరు అయినా ఒప్పుకునే పేరు అమితాబ్ బచ్చన్. గత నాలుగు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరించడంలో ఎప్పుడూ అలిసిపోని ఈ నట శిఖరం కొత్త సినిమా బద్లా నిన్న విడుదలైన పాజిటివ్ రివ్యూస్ మధ్య మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీలో అమితాబ్ తో పాటు తాప్సి పన్ను పెర్ఫార్మన్స్ మీద పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి,
దీనికి స్పందనగా వివిధ మీడియా సైట్స్ లో వచ్చిన రేటింగ్స్ ని రివ్యూస్ ని ప్రత్యేకంగా ఇమేజ్ రూపం లో అమితాబ్ ట్విట్టర్ లో షేర్ చేసారు. ఇక దీని పని అయిపోయింది రేపటి నుంచి నేను ఖాళీ ఎవరు ఉద్యోగం ఇస్తారు గత 40 ఏళ్ళ నుంచి ఈ ప్రశ్న వేస్తూనే ఉన్నాను అని దానికో మెసేజ్ జోడించారు. అంటే బద్లా అయిపోయింది కాబట్టి ఇంకొకరు షూటింగ్ కి పిలిచే దాకా ఖాళీ అని చెప్పడం బిగ్ బి ఉద్దేశం
దీనికి మరో స్టార్ బాద్షా కింగ్ షారుఖ్ ఖాన్ స్పందించాడు. తనదైన శైలిలో రీ ట్వీట్ చేస్తూ మీకు జాబ్ దొరికాక నన్ను కూడా రికమండ్ చేయండి నేను కూడా ఖాళీగా ఉన్నాను అంటూ అర్థం వచ్చేలా ట్వీట్ చేయడంతో ఇది అభిమానుల మధ్య వైరల్ అయిపోయింది. అయినా బాలీవుడ్ చరిత్రలో తమకంటూ ప్రత్యేక పేజీలను బంగారు సిరాతో రాసుకున్న ఈ దిగ్గజాలు ఇలా ఖాళీ ఉన్నామని పబ్లిక్ గా చెప్పుకోవడం వింతే. ఎంత ఎదిగినా ఒదిగిపోవడం అంటే ఇదేనంటూ ఇద్దరు హీరోల అభిమానులు మురిసిపోతే ఇది మరీ విడ్డూరం అంటూ మరికొందరు వ్యంగ్యంగా నోళ్లు నొక్కుకున్నారు. అన్నట్టు ఇది అమితాబ్ 3112 ట్వీటట. ప్రతి దానికి నెంబర్ వేసి పోస్ట్ చేయడం అమితాబ్ కున్న అలవాటు