Begin typing your search above and press return to search.

ఒకసారి ఆస్కార్ ను టచ్ చేయనివ్వండి..!

By:  Tupaki Desk   |   10 Jan 2023 1:26 PM GMT
ఒకసారి ఆస్కార్ ను టచ్ చేయనివ్వండి..!
X
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ లేటెస్ట్ గా తన ట్విట్టర్ లో చరణ్ కు థ్యాంక్స్ చెప్పారు. షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన పఠాన్ ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ పై చరణ్ తన స్పందన తెలియజేస్తూ ఒక ట్వీట్ చేశారు. దీనికి షారుఖ్ కూడా రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యు మెగా పవర్ స్టార్ అంటూ రాసుకొచ్చారు. మీ ఆర్.ఆర్.ఆర్ టీం ఇండియాకు ఆస్కార్ తెస్తే తనని ఒకసారి టచ్ చేయనివ్వండి అని అన్నారు. దీనికి చరణ్ కూడా అఫ్కోర్స్ సర్ అది ఇండియన్ సినిమా అవార్డు అని చెప్పారు.

కింగ్ ఖాన్ షారుఖ్ ఇలా సౌత్ హీరోతో చేసిన ట్విట్టర్ సంభాషణలు ప్రస్తుతం అందరిని సర్ ప్రైజ్ చేస్తుంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ లెవల్లో సౌత్ సినిమాలు చేస్తున్న హంగామాతో బాలీవుడ్ స్టార్స్ కూడా వారిని ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ కూడా ట్రిపుల్ ఆర్ కి ఆస్కార్ వస్తే తనని ఒకసారి టచ్ చేయనివ్వండి అంటూ ట్వీట్ చేశారు. సో ఒక్క ట్వీట్ తో ఇండియన్ సినిమా అంతా ఒక్కటే అనేలా మంచి వాతావరణం ఏర్పడిందని చెప్పొచ్చు.

సినిమాల పరంగా ఎంత పోటీ పడినా మన ఇండియన్ సినిమా అకాడమీ అవార్డుల్లో పోటీ పడుతుంది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆ సినిమాకు ఆస్కార్ రావాలని ఆశిస్తారు. ఆర్.ఆర్.ఆర్ కు ఆస్కార్ రావడం పక్కా అని ఇప్పటికే చాలామంది జోస్యం చెబుతున్నారు. అయితే అదే మాటని మరింత బలంగా నమ్మేలా షారుఖ్ కూడా ఆస్కార్ వస్తే తనని ఒకసారి టచ్ చేయనివ్వండి అని అన్నారు.

ఒకప్పుడు బాలీవుడ్ ని ఏలిన షారుఖ్ ఖాన్ కొన్నాళ్లుగా సరైన సూపర్ హిట్ లేక సతమతమవుతున్నారు. పఠాన్ తర్వాత తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో జవాన్ సినిమా చేస్తున్నారు షారుఖ్. ఆ సినిమాతో సౌత్ ఆడియన్స్ ని కూడా పలుకరించబోతున్నారు. పఠాన్ సినిమాను కూడా పాన్ ఇండియా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమాలతో షారుఖ్ బౌన్స్ బ్యాక్ అవుతారా లేదా అన్నది చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.