Begin typing your search above and press return to search.
షాక్: మార్వల్ అవెంజర్స్ లో షారూక్
By: Tupaki Desk | 14 Sep 2018 12:03 PM GMTఈ ప్రపంచాన్ని సినిమా సరికొత్తగా ఆవిష్కరిస్తోంది. ప్రపంచంలో ఎక్కడైనా యూనివర్శల్ ఫార్ములాతో సినిమా తీస్తే వర్కవుటవుతుందని పక్కాగా ప్రూవ్ అయ్యింది. అది హాలీవుడ్ సినిమా అయినా - ఇండియన్ సినిమా అయినా.. పాయింట్ నచ్చితే భాష - ప్రాంతంతో సంబంధమే లేకుండా ప్రపంచవ్యప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇటీవలి కాలంలో హాలీవుడ్ సినిమాలన్నీ ఇండియా నుంచి దాదాపు 300 కోట్ల వసూళ్లు సునాయాసంగా కొల్లగొడుతున్నాయి. అసలు మన హీరో అన్న సెంటిమెంటు అన్నదే లేకుండా అడిక్ట్ అయ్యి మనవాళ్లు విదేశీ సినిమాలు చూస్తున్నారు. అయితే ఈ మార్కెట్ అంతటికే పరిమితం కాదు. ఇది అన్ లిమిటెడ్. ఇండియన్ బాక్సాఫీస్ నుంచి వేల కోట్లు కొల్లగొట్టొచ్చని హాలీవుడ్ పసిగట్టింది. ఆ క్రమంలోనే ఇండియాలో కలెక్షన్లు పెంచుకునేందుకు హాలీవుడ్ దర్శకనిర్మాతలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. అందులో తొలి స్టెప్ గా మార్వల్ సంస్థ ఒకడుగు ముందుకేసింది.
మార్వల్ నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక సిరీస్ `అవెంజర్స్`లో కింగ్ ఖాన్ షారూక్ ని సూపర్ హీరోగా ఎంపిక చేసుకునే ఎత్తుగడ వేశారు. ఇలా చేస్తే ఇండియా నుంచి వందల కోట్లు కొల్లగొట్టడం ఎంతో సులువు అని అంచనా వేస్తున్నారు. డెడ్ పూల్ 2 చిత్రంలో డోపిండర్ పాత్ర.. షారూక్ సినిమా `స్వదేశ్`లోని ఓ పాటను వింటూ కనిపిస్తుంది. దానికి ఇండియన్ ఆడియెన్ నుంచి గొప్ప స్పందన వచ్చింది. అందుకే షారూక్‌ని తమ సినిమాల్లో నటింపజేస్తే బిజినెస్ పరంగానూ పెద్ద రేంజులో వర్కవుటవుతుందని మార్వల్ సంస్థ క్రియేటివ్ హెడ్ స్టీఫెన్ వాకర్ భారీ ప్లాన్ వేశారు. అంటే ఇదివరకూ అవెంజర్స్ చిత్రంలో అందరూ సూపర్ హీరోల్ని చూపించారు. వాళ్లందరికీ ఇప్పుడు అదనంగా షారూక్ కూడా యాడవ్వబోతున్నాడని అంచనా వేయొచ్చు.
ఒకవేళ ఇదే వర్కవుటైతే.. ఇండియాలో కలెక్షన్ల సునామీ ఖాయం. ఇన్నాళ్లు 300 కోట్లు ఉన్న వసూళ్లు 1000 కోట్లకు చేరతాయి. ఈ ఆఫర్ ఓ రకంగా షారూక్ కి వరల్డ్ వైడ్ ఇమేజ్ పెంచుతుంది. అన్నట్టు అసలు షారూక్ లో ఏం చూసి ఈ ఛాన్సిస్తున్నారు? అంటే అతడు నటించిన సూపర్ హీరో మూవీ `రా-వన్` చూసి ఎంపిక చేసుకున్నామని చెబుతున్నారు. ఇండియాలో ఆడియెన్ స్థానిక నటుల్ని తెరపై చూడాలని అనుకుంటారు. అందుకే తనని ఎంపిక చేసుకుంటున్నామని స్టీఫెన్ తెలిపారు. ఇక ఇన్నాళ్లు ఉత్తర అమెరికాని దృష్టిలో ఉంచుకుని హాలీవుడ్ సినిమాలు తీసేవారు. ఇకపై ఇండియాని దృష్టిలో ఉంచుకుని కథలు మార్చుకోవడం ఖాయం. ఒకసారి షారూక్ సక్సెసైతే - ఇక ఇతరత్రా టాప్ హీరోలకు అవకాశం లభిస్తుందనడంలో ఎలాంటి సందేహాలు లేవు.