Begin typing your search above and press return to search.
త్వరలో షారుఖ్ ఖాన్ అరెస్ట్?
By: Tupaki Desk | 16 Jun 2017 10:03 AM GMTబాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ముంబై వాంఖడే స్టేడియంలోకి షారుఖ్ కు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఆయన సరదాగా చేసిన పనికి అరెస్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం తన చిత్రం రయీస్ ప్రచారంలో భాగంగా జనాలపై టీ షర్ట్ విసిరిన ఘటన ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది.
ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన రయీస్ చిత్ర ప్రమోషన్ లో భాగంగా షారుఖ్ వడోదరకు క్రాంతి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించారు. బాలీవుడ్ బాద్ షాను చూడడానికి అభిమానులు భారీ సంఖ్యలో రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. రైల్లోంచి బయటకు వచ్చిన షారుక్ సరదాగా జనాలపైకి టీషర్టులు.. బాల్స్ విసిరారు. ఆ వస్తువుల్ని అందుకోవాలన్న అతృతలో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది.
ఈ తొక్కిసలాటలో ఒక వ్యక్తి మరణించగా, ఇద్దరు పోలీసులు స్పృహ కోల్పోయారు. ఇదంతా షారుఖ్ టీ షర్టులు.. బాల్స్ విసిరేయటం వల్లేనని వడోదర రైల్వే డీఎస్పీ తరుణ్ బరోత్ కోర్టుకు ఇచ్చిన నివేదికలో వెల్లడించారు. ఒక వ్యక్తి మరణానికి.. తొక్కిసలాటకు కారణమైన షారుఖ్‌ను అరెస్ట్ చేయాలని కోర్టును కోరారు. ఈ ఘటనపై కోర్టు ఎటువంటి చర్య తీసుకుంటుందో వేచి చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/