Begin typing your search above and press return to search.
డ్రగ్స్ కేసులో షారుఖ్ కొడుకును ట్రాప్ చేసి ఇరికించారా?
By: Tupaki Desk | 5 Oct 2021 4:34 AM GMTముంబై తీరంలోని సముద్రంలో క్రూయిజ్ షిప్ లో రేవ్ పార్టీ చేసుకుంటూ పట్టుబడ్డ కేసులో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ సహా 8మందిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు ఆదివారం అరెస్ట్ చేయడం సంచలనమైంది. పార్టీకి వెళ్లకూడదని అతడు భావించినప్పటికీ దగ్గరి మిత్రుడి ప్రోద్బలంతోనే అక్కడికి వెళ్లి ఒక ట్రాప్ లో చిక్కుకున్నట్లు అతడి తరుఫు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఎన్సీబీ అధికారులు క్రూయిజ్ షిప్ పై దాడి చేసినప్పుడు అందులో ఏకంగా 1000 మందికి పైగా అక్కడ ఉన్నట్లు సమాచారం. కానీ పోలీసులు 8మందిని మాత్రమే అరెస్ట్ చేశారని మీడియా వర్గాలు తెలుపడంతో ఇదంతా పక్కా ప్లానింగ్ ప్రకారమే జరుగుతోందని అర్థమవుతోంది. ఆర్యన్ ఈ పార్టీకి వెళ్లకూడదనుకున్నాడు. కానీ ఒక దగ్గరి మిత్రుడు పార్టీకి రమ్మని బలవంతం చేయడంతో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆర్యన్ తరుఫున న్యాయవాది మనీష్ షిండే తన వాదనలు వినిపిస్తూ ‘పార్టీకి వెళ్లడానికి ఆర్యన్ కు టిక్కెట్ లేదు. అతడి ఫోన్ ను చెక్ చేసినప్పటికీ ఏమీ బయటపడలేదు. ఎన్సీ అధికారులు వీరిని మాత్రమే అరెస్ట్ చేశారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి’ అని కోర్టులో ఆరోపించారు.
మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ఆర్యన్ ను దగ్గరి మిత్రుడు ఫోర్స్ చేయడంతోనే పార్టీకి వెళ్లాడు. అందులో 1000 మంది ఉన్నా 8మందినే అరెస్ట్ చేశారు. ఇక ఆర్యన్ తన పేరుమీద క్రూయిజ్ షిప్ లో రూమ్ ను కూడా బుక్ చేసుకోలేదు. కానీ పార్టీ నిర్వాహకులు ఆర్యన్, అర్బాజ్ మర్చంట్ లకు కాంప్లిమెంటరీ రూమ్ లు ఇచ్చారు. ఆ రూమ్ లోకి వారు వెళుతున్నప్పుడు ఎన్సీబీ అధికారులు అకస్మాత్తుగా దాడి చేసి వారిని అరెస్ట్ చేశారు.
పోలీసులు ఆర్యన్ ను సోదా చేసినప్పుడు ఎటువంటి డ్రగ్స్ దొరకలేదు.కానీ అర్బాజ్ మర్చంట్ షూస్ లో చరస్ పౌడర్ లభించింది. కొత్తవారితో పార్టీకి వెళుతున్నప్పుడు ఆర్యన్ ఇంట్లో కూడా చెప్పలేదు. అందువల్ల అరెస్ట్ అనంతరం వెంటనే షారుఖ్ మేనేజర్ కు ఫోన్ చేయడంతో విషయం తెలిసింది.