Begin typing your search above and press return to search.
'శ్యామ్ సింగ రాయ్' హిందీ రీమేక్ లో షాహిద్?
By: Tupaki Desk | 7 Feb 2022 7:32 AM GMTసౌత్ ఇండస్ట్రీలో భారీ విజయాలను సాధించిన సినిమాలను బాలీవుడ్లో రీమేక్ చేయడానికి సల్మాన్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపేవారు. ముఖ్యంగా తెలుగు .. తమిళ భాషల్లో విడుదలైన సినిమాలపై ఆయన ఒక కన్నువేసి ఉంచేవారు. ఇక్కడ ఏ సినిమా హిట్ అయినా అక్కడ రీమేక్ గా దానిని లైన్లో పెట్టేవారు. ఆ తరువాత అక్షయ్ కుమార్ కూడా అదే పద్ధతిని ఫాలో అవుతూ వచ్చారు. ఇక ఇప్పుడు ఆ బాటలో షాహిద్ కపూర్ నడుస్తున్నట్టుగా అర్థమవుతోంది. సౌత్ సినిమాల రీమేక్ లను ఆయన బాలీవుడ్లో చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు.
తెలుగులో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన 'అర్జున్ రెడ్డి' సినిమా, కొత్త ట్రెండ్ ను సృష్టించింది. అదే సినిమాను ఆయన హిందీలో 'కబీర్ సింగ్' టైటిల్ తో రీమేక్ చేశాడు. హిందీ రీమేక్ లో హీరోగా చేసిన షాహిద్ కపూర్ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత తెలుగులో నాని హీరోగా చేసిన 'జెర్సీ' సినిమా హిందీ రీమేక్ లోను షాహిద్ కపూర్ చేశారు. తెలుగు 'జెర్సీ'కి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరినే హిందీ రీమేక్ ను తెరకెక్కించాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఇప్పుడు 'శ్యామ్ సింగ రాయ్' సినిమా హిందీ రీమేక్ లోను షాహిద్ కపూర్ చేయనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా 'శ్యామ్ సింగ రాయ్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. అంతకుముందు రాహుల్ 'ట్యాక్సీవాలా' చేశాడు. ఆ తరువాత ఆయన చేసిన సినిమా ఇది. అయితే ఈ కథా నేపథ్యం వేరు. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ఈ కథ నడుస్తుంది. అందుకు భారీ సెట్లు వేయడం జరిగింది.
రాహుల్ ఇంతపెద్ద కథను డీల్ చేయలేడనే ఉద్దేశంతో కొంతమంది నిర్మాతలు వెనకడుగు వేసినట్టుగా ఆయనే ఒక సందర్భంలో చెప్పాడు. అలాంటి ఈ సినిమా ఒక వైపున 'అఖండ' .. మరో వైపున 'పుష్ప' ధాటిని తట్టుకుని నిలబడింది. దర్శకుడిగా రాహుల్ ను మరోస్థాయికి తీసుకుని వెళ్లింది. దాంతో ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి రాహుల్ రెడీ అవుతున్నాడట. ఆల్రెడీ ఈ సినిమాను చూసిన షాహిద్, ఈ రీమేక్ లో చేయడానికి ఆసక్తిని చూపుతున్నాడని అంటున్నారు. ఆయనతోనే రాహుల్ ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి