Begin typing your search above and press return to search.
దేవరకొండలా చేయడం కష్టమైంది!-షాహిద్
By: Tupaki Desk | 13 May 2019 4:57 PM GMTఅర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ పేరు జాతీయ స్థాయిలో మార్మోగిన సంగతి తెలిసిందే. పెళ్లి చూపులు చిత్రంతోనే జాతీయ అవార్డులు దక్కాయి. అటుపై అర్జున్ రెడ్డితో అతడి స్థాయి మరో లెవల్ కి చేరుకుంది. అర్జున్ రెడ్డిలో ఆల్కహాలిక్ డ్రగ్ అడిక్ట్ మెడికో పాత్రలో అతడి నటన జాతీయ స్థాయిలో డిబేట్ కి కారణమైంది. ఆ క్రమంలోనే ఈ సినిమాని హిందీలోనూ షాహిద్ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి చిత్రం హిందీలో ఎలా తెరకెక్కింది? షాహిద్ ఎలా నటించారు? అన్నదానికి ఇదిగో ఇదే సమాధానం.
తాజాగా ఓ లైవ్ ప్రమోషన్ లో షాహిద్ మీడియాతో మాట్లాడుతూ దేవరకొండ నటనను ఆకాశానికెత్తేశాడు. తనని మ్యాచ్ చేయడం చాలా కష్టమైందని అంగీకరించాడు. అసలు రీమేక్ చేయడం అన్నదే చాలా కష్టమైన పని. క్యారెక్టర్ డ్రివెన్ సినిమా ఇది. ఒరిజినల్ లో ఉన్నట్టు యథాతథంగా చేయడం చాలా కష్టమైంది. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ పెర్ఫామెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. అతడు తన నటనతో సినిమా మొత్తం ఎమోషన్ ని క్యారీ చేసిన విధానం వండర్. అర్జున్ రెడ్డి- ప్రీతి మధ్య లవ్ స్టోరి.. మైమరిపించింది. అందుకే అదే దర్శకుడితో కలిసి పని చేయడం అంటే చాలా జాగ్రత్త తీసుకోవాల్సి వచ్చింది`` అని అన్నారు.
షాహిద్ అంతటి సీనియర్ .. విజయ్ దేవరకొండ కెరీర్ ఆరంభంలో చాలా గొప్పగా నటించాడని పొగిడేయడం ఆసక్తికరం. అంత నటనను మ్యాచ్ చేయడం నాకు కొంచెం కష్టంగానే అనిపించిందని నిజాయితీగా అంగీకరించడం చూస్తే దేవరకొండ లెవలెంతో అర్థం చేసుకోవచ్చు. యథాతథంగా తెలుగు వెర్షన్ లానే తీసిన సినిమా కాబట్టి అర్జున్ రెడ్డి చిత్రంలోని ఎమోషన్ బాలీవుడ్ లో ఆడియెన్ కి కూడా కనెక్టయితే చాలు సక్సెసైపోతుంది. అర్జున్ రెడ్డి బ్యూటీని ఏమాత్రం మిస్ చేయకుండా తెరకెక్కించాం. కబీర్ సింగ్ లో అది ప్రతిబింబిస్తుంది. అభిమానులు ఎవరినీ నిరాశపరచదు. లవ్ లీ ఫిలిం ఇది.. అనీ షాహిద్ తెలిపారు. ఈ చిత్రంలో కియరా అద్వాణీ కథానాయికగా నటించింది.