Begin typing your search above and press return to search.
హిందీ అర్జున్ రెడ్డి లో ఊర్వసి ఊర్వసి!
By: Tupaki Desk | 8 Aug 2018 1:30 AM GMT'ఊర్వసి ఊర్వసి' సాంగ్ ఈ సోషల్ మీడియా జెనరేషన్ ప్రేక్షకులకు 'కొత్త' అయ్యుండచ్చు.. ప్చ్.. సారీ.. అది పాతికేళ్ళ క్రితం 'పాత' పాట కదా! కానీ ఒక్కోసారి ఫ్లాష్ బ్యాక్ లు ఎంత బాగుంటాయంటే 'బాషా'లో లా అసలు సినిమా కంటే ఫ్లాష్ బ్యాకే ప్రేక్షకులకు డీప్ గా కనెక్ట్ అవుతుంది. మాకెందుకీ తమిళ సినిమా ఉదాహరణ అంటారా..? అప్పుడు మనకు అచ్చ తెలుగు నందమూరి హీరో బాలయ్య నటించిన 'సమరసింహారెడ్డి' ఫ్లాష్ బ్యాక్ ఉంది కదా!
ఇప్పుడు ఈ 'ఊర్వసి ఊర్వసి' పాటను బాలీవుడ్ 'అర్జున్ రెడ్డి' రీమేక్ కోసం రీమిక్స్ చేస్తున్నారట. ఇంతకీ ఈ ఊర్వసి ఊర్వసి పాట సంగతేంటి అంటే.. 'కాదలన్'(తెలుగు లో 'ప్రేమికుడు') అనే 1994 లో రిలీజ్ అయిన సినిమాలో AR రహమాన్ స్వరపరిచిన ఓ కల్ట్ క్లాసిక్ సాంగ్. సినిమా డైరెక్టర్ శంకర్. హీరో ప్రభుదేవా.. అంటే హీరోగా ప్రభుదేవా కు మొదటి సినిమా. ఇక చెప్పేదేముంది. తన దగ్గరున్న కోరియోగ్రఫీనంతా పిచ్చ పిచ్చగా ఈ రహమాన్ ట్యూన్ కి వాడేశాడు. దానికి తోడు శంకర్ పిక్చరైజేషన్ పీక్స్ లో ఉంటుంది.
సో.. ఫ్లాష్ బ్యాక్ ఓవర్... నౌ ఇట్ ఈజ్ 2018. మన తెలుగు సెన్సేషన్ 'అర్జున్ రెడ్డి' రీమేక్ లో ఈ పాటను రీమిక్స్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్రను పోషిస్తున్నాడు.. షాహిద్ బాలీవుడ్ లో ఉన్న బెస్ట్ డాన్సర్స్ ఓ ఒకడు. సో డాన్స్ కి ఇబ్బంది లేదు. కియారా కూడా డాన్స్ లో దిట్టే.. ఎందుకంటే ఇప్పటివరకూ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన కొన్ని డాన్స్ వీడియోల్లో డ్యాన్సు ను ఇరగదీసింది.
వీళ్ళిద్దరూ ఒకే గానీ రెహమాన్ ట్యూన్ ను రీమిక్స్ చేసి, శంకర్ పిక్చరైజేషన్ కంటే బెటర్ గా చేయగలగడం అనేది ఎవరికైనా కాస్త కష్టమైన విషయమే. దానికి తోడు మన 'అర్జున్ రెడ్డి' లో ఎమోషన్స్ ఉంటాయి.. ఈ డ్యాన్స్ ల సంగతేంటో అర్థం కావడం లేదు. మరి ఈ బాలీవుడ్డోళ్ళు ఆ పాటను ఈ సీరియస్ & ఇంటెన్స్ లవ్ స్టొరీలో పెట్టి సినిమాను, పాటను కలిపి హోల్ సేల్ గా చెడగొడతారా లేదంటే ఆ పాటను ఇంకా సూపర్ గా మార్చి ప్రేక్షకులనుండి ప్రశంసలు అందుకుంటారా అనేది ఇప్పుడే మనకు తెలీదు. వెయిట్ చేద్దాం.. చూద్దాం!