Begin typing your search above and press return to search.
బట్టలు అరువు తెచ్చుకున్న స్టార్ హీరో!
By: Tupaki Desk | 10 May 2019 7:50 AM GMT'అర్జున్ రెడ్డి' సినిమాను 'కబీర్ సింగ్' టైటిల్ తో హిందీలో తెరకెక్కిస్తున్నారనే సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్.. కియారా అద్వాని ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒరిజినల్ సినిమా దర్శకుడు సందీప్ వంగానే రీమేక్ చిత్రానికీ డైరెక్టర్ కావడంతో హిందీ ప్రేక్షకులలోనే కాకుండా తెలుగు ఆడియన్స్ లో కూడా 'కబీర్ సింగ్ పై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా జూన్ 21 న రిలీజ్ చేసేందుకు ఫిలిం మేకర్స్ ప్లాన్ చేశారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు ఆడియన్సుకు ఆసక్తిని మరింతగా పెంచుతున్నాయి ఈ సినిమాలో షాహిద్ ఒక కాలేజ్ స్టూడెంట్ పాత్రలో నటిస్తున్నాడు. స్టూడెంట్ గా తన కాస్ట్యూమ్స్ సహజంగా ఉండాలనే ఉద్దేశంతో ఢిల్లీలో కొందరు నిజమైన స్టూడెంట్స్ దగ్గర బట్టలను అరువు తెచ్చుకున్నాడట. ఆ స్టూడెంట్స్ తో రెగ్యులర్ గా స్పెండ్ చేస్తూ వారి హావభావాలను గమనించేవాడట. తను పోషించే పాత్రను సరిగా అర్థం చేసుకోవాడనికి ఇదంతా చేశానని చెప్పుకొచ్చాడు. షాహిద్ ను చూస్తుంటే ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాడని అనిపిస్తోంది కదా?
జస్ట్ స్టూడెంట్స్ బట్టలు చేబదులు తీసుకుంటేనే కష్టం ఏంటంటారా.. ఇదొక్కటే కాదు. షూటింగ్ కోసం డైలీ 20 సిగరెట్లు కాల్చాల్సి వచ్చిందని కొద్ది రోజుల క్రితం వెల్లడించాడు. మళ్ళీ తన పిల్లలతో ఆడుకోవడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో సిగరెట్ కంపు పోవడానికి దాదాపు గంట స్నానం చేసేవాడట. "అబ్బో చాలా కష్టపడ్డాడు" అని ఇప్పుడైనా అంటారా లేదా ?