Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా స్టార్‌ ను చిన్న పిల్లాడు అనేసిన యంగ్‌ హీరో

By:  Tupaki Desk   |   10 Feb 2023 10:00 AM GMT
పాన్ ఇండియా స్టార్‌ ను చిన్న పిల్లాడు అనేసిన యంగ్‌ హీరో
X
బాలీవుడ్‌ యంగ్‌ హీరో షాహిద్ కపూర్‌ నటించిన ఫర్జీ వెబ్‌ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ కు సిద్ధం అయ్యింది. ఫిబ్రవరి 10వ తారీకున స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న ఈ వెబ్‌ సిరీస్‌ లో షాహిద్ కపూర్ తో పాటు పాన్ ఇండియా స్టార్‌ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించాడు. ఈ వెబ్‌ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా షాహిద్‌ కపూర్ పలు విషయాలను మీడియాతో షేర్‌ చేసుకున్నాడు.

తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ కపూర్ మాట్లాడుతూ విజయ్‌ సేతుపతి తో మొదటి సారి కలిసి పని చేసినందుకు సంతోషిస్తున్నాను. ఆయన చాలా అమాయకంగా ఉంటాడు. ఆయన ప్రవర్తన చిన్నపిల్లాడి మాదిరిగా ఉంటుంది. అంతే కాకుండా విజయ్ సేతుపతి తో నటించడం ఒక గొప్ప అనుభూతిని మిగుల్చుతుందని పేర్కొన్నాడు.

ఆయనతో వర్క్‌ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా నేర్చుకుంటారు. ఆయన స్వచ్చమైన నటుడు. ప్రతి విషయంలో కూడా చాలా లోతుగా ఆలోచిస్తూ నటిస్తూ ఉంటాడు. ఆయనతో వర్క్ చేయడంను ముందు ముందు కూడా కోరుకుంటాను అన్నట్లుగా షాహిద్ కపూర్‌ కామెంట్స్ చేశాడు.

ఫర్జీ గురించి షాహిద్ కపూర్ మాట్లాడుతూ.. మొదటి సారి నేను వెబ్‌ సిరీస్ చేయడం జరిగింది. ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందో అనేది ఆసక్తిగా ఉంది. 20 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఇండస్ట్రీలో నిలిచాను. అనుకూలతలతో పాటు ప్రతికూలతలు కూడా ఇండస్ట్రీలో చాలా ఉంటాయి. వాటికి తగ్గట్లుగా కెరీర్ లో ముందుకు సాగాను అన్నాడు.

ది ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌ తో ఆకట్టుకున్న రాజ్ అండ్ డీకే దర్శకద్వయం ఈ వెబ్‌ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ఈ వెబ్‌ సిరీస్ లో షాహిద్ కపూర్‌.. విజయ్ సేతుపతితో పాటు కృతి సనన్‌.. పంకజ్ కపూర్‌.. నసీర్ లు నటించారు. మరో వైపు షాహిద్ కపూర్‌ డుంకీ సినిమాలో నటిస్తున్నాడు. రాజ్ కుమార్‌ హిరానీ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.