Begin typing your search above and press return to search.

షాహిద్ కపూర్ కి అంత సీనుందా..?

By:  Tupaki Desk   |   16 April 2017 7:37 AM GMT
షాహిద్ కపూర్ కి అంత సీనుందా..?
X
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ర్టీలో ఎందరో స్టార్ లు ఉన్నా సూపర్ స్టార్ లు అతి కొద్ది మందే. అయితే.. ఓ బాలీవుడ్ హీరో ఆ సూపర్ స్టార్ కిరీటాన్ని బలవంతాన తన తలకు తగిలించుకోవాలనుకుంటున్నాడట. తన గురించి రాసేటప్పుడు అలాగే రాయాలంటూ ఓ పత్రికా ఎడిటర్ పైనా వీరంగమాడాడట. దాంతో ఆయన తీరును చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. స్వయంగా ప్రకటించుకుంటే వచ్చే కిరీటం కాదని... సూపర్ స్టార్ అన్న బిరుదు కొందరికి మాత్రమే సూటవుతుందని అంటున్నారు.

బాలీవుడ్ స్టార్ షాహీద్ కపూర్ ఇటీవల ఓ పత్రిక ఎడిటర్‌ తో ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. తనను స్టార్ కాకుండా సూపర్‌ స్టార్ అని సంభోదించాలని ఎడిటర్‌ పై ఒత్తిడి తీసుకు వచ్చినట్టు ప్రచారమవుతోంది. రంగూన్ చిత్రం విడుదలకు ముందు ఓ స్టోరీని ప్రచురించాలని ఆ పత్రిక ఎడిటర్ ప్లాన్ చేశారట. ఆయన్ను కలిసి మాట్లాడిన తరువాత కథనం రాసి ప్రింటింగ్ కోసం పంపించడానికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో మ్యాగజైన్ ఎడిటర్ షాహీద్ ఫోన్ చేసి వాగ్వాదానికి దిగాడు. హెడ్ లైన్లో సూపర్‌ స్టార్‌ అని రాయాలని చెప్పాడట.

అయితే... ఆ ఎడిటర్ అందుకు నో చెప్పాడట. అంతేకాదు.. చిరాకొచ్చి ఆ స్టోరీని ఏకంగా తొలగించాడట. కాగా ఆ తరువాత రిలీజైన రంగూన్ దారుణంగా ఫెయిలైన సంగతి తెలిసిందే కదా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/