Begin typing your search above and press return to search.

మరోసారి గాయపడ్డ హీరో

By:  Tupaki Desk   |   1 Oct 2017 12:09 PM IST
మరోసారి గాయపడ్డ హీరో
X
ఏ సినిమా షూటింగ్ లో అయినా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చిత్ర యూనిట్ సభ్యులు ముందే జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరిస్తున్నప్పుడు తారలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక ప్లాన్ తో ముందే రెడీగా ఉంటారు. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి అనుకోకుండా ప్రమాదాలు జరుగుతాయి. ఒక్కసారి జరిగితే నెక్స్ట్ టైమ్ షూటింగ్ లో అలా జరగకుండా చూసుకుంటారు. కానీ ఒక సినిమా చిత్రీకరణ లో హీరో రెండు సార్లు గాయపడ్డాడు.

బాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం పద్మావతి. చారిత్రాత్మక నేపథ్యంలో ఈ సినిమాను సంజయ్ లీలా బన్సాలి విజువల్ వండర్ గా తీస్తున్నాడు. లీడ్ రోల్ లో దీపికా పదుకొణే నటిస్తోంది. ఇక ముఖ్య పాత్రలల్లో షాహిద్ కపూర్ - రణ్‌ వీర్ సింగ్ లు నటిస్తున్నారు. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుండి ఎదో ఒక సమస్య తెలెత్తుతూనే ఉంది. సినిమా ప్రారంభ దశలో జులైలో షాహిద్ కపూర్ గాయపడ్డాడు. అప్పుడు కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో షాహిద్ మరోసారి గాయపడ్డాడు. ఆయన కాలికి గాయం అవ్వడంతో పది రోజులు రెస్ట్ తీసుకున్నట్లు బాలీవుడ్ మీడియా ద్వారా తెలుస్తోంది.

చారిత్రక నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షాహిద్‌ - రాజా రతన్‌ సింగ్‌ గా నటిస్తున్నాడు. ఇక రణ్‌ వీర్‌ అల్లావుద్దీన్‌ ఖిల్జీగా నెగెటివ్ రోల్ లో నటిస్తున్నారు. రీసెంట్ గా దీపికా పదుకొనె ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. అలాగే షాహిద్ లుక్ కూడా వచ్చేసింది. డిసెంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.