Begin typing your search above and press return to search.

బిడ్డ కోసం అర్జున్ రెడ్డి అడ్జస్ట్ మెంట్

By:  Tupaki Desk   |   7 July 2018 5:25 AM GMT
బిడ్డ కోసం అర్జున్ రెడ్డి అడ్జస్ట్ మెంట్
X
టాలీవుడ్ లో గత ఏడాది సెన్సేషనల్ హిట్ గా నిలిచిన అర్జున్ రెడ్డిని సినిమా ప్రేమికులు మర్చిపోవడం కష్టం. ఒక ప్రేమికుడి నిజాయితీని బోల్డ్ గా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మెప్పించడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద కనక వర్షం కురిసేలా చేసింది. ఇలాంటి బ్లాక్ బస్టర్ మీద సహజంగానే ఇతర బాషల దర్శక నిర్మాతల కన్ను పడటం సహజం. ఇప్పటికే తమిళ్ లో విక్రమ్ వారసుడు ధృవ్ హీరోగా బాలా దర్శకత్వంలో దీని రీమేక్ ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. మరోవైపు బాలీవుడ్ లో రీమేక్ మాత్రం తానే చేస్తున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హీరో కోసం షెడ్యూల్ ని ప్రీ పోన్ చేయటం విశేషం. ఇందులో హీరోగా షాహిద్ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇతని భార్య మీరా రాజ్ పుత్ ప్రస్తుతం గర్భవతి. రెండో బిడ్డకు త్వరలోనే జన్మనివ్వబోతోంది. డెలివరీ సమయానికి తాను పక్కన ఉండాలన్న ఉద్దేశంతో షాహిద్ కపూర్ ముందు అనుకున్న ప్రకారం కాకుండా కాస్త ముందుకు జరిపి ఆగస్ట్ మొదటి వారం నుంచే ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసేలా మార్పు చేసుకుని దానికి అనుగుణంగానే తీయబోతున్నారు.

పుట్టబోయే బిడ్డ కోసం ఇంత ప్లాన్ తో ఉన్న ఉన్న షాహిద్ కపూర్ ని అందరు మెచ్చుకుంటున్నారు. పద్మావత్ తో ఈ ఏడాది మొదటి బ్లాక్ బస్టర్ అందుకున్న షాహిద్ దానికి పూర్తి వ్యతిరేకమైన పాత్రను అర్జున్ రెడ్డి రీమేక్ లో చేయబోతున్నాడు. టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఉడ్తా పంజాబ్ లో డ్రగ్స్ కు అలవాటు పడిన సింగర్ పాత్రలో అద్భుతంగా జీవించిన షాహిద్ అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలడని భావించి నిర్మాతలు ఫైనల్ గా ఇతన్నే లాక్ చేసారు. ఇతని కంటే ముందు వరుణ్ ధావన్ అర్జున్ కపూర్ లను తీసుకునే ఆలోచనలు కూడా జరిగాయి. కానీ నిర్ణయం తీసుకునే విషయంలో వాళ్లిద్దరూ జాప్యం చేయటంతో ఇది కాస్త షాహిద్ ఒళ్ళోకొచ్చి వాలింది. తమిళ్ హిందీ రీమేక్స్ ఇప్పటికే ఖరారు కాగా కన్నడలో కూడా ఒక స్టార్ యూత్ హీరో తో దీన్ని రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.