Begin typing your search above and press return to search.
రోడ్లపై అర్జున్ రెడ్డి హీరో సొంత డ్రైవ్
By: Tupaki Desk | 1 Jan 2019 10:08 AM GMTవిజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా విజయానికి ప్రధాన కారణం హీరో పాత్ర ప్రవర్తన. హీరో అటిట్యూడ్ మరియు బాడీలాంగ్వేజ్ కారణంగా సినిమా సూపర్ హిట్ అయ్యింది. అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండ బుల్లెట్ పై పరుగులు తీస్తుంటే ప్రేక్షకులు ముఖ్యంగా యూత్ ఆడియన్స్ అతడిని యూత్ ఐకాన్ అన్నారు. ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే.
‘కబీర్ సింగ్’ టైటిల్ తో రీమేక్ అవుతున్న ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది. ఈ సందర్బంగా షాహిద్ పాత్రలో ఇన్వాల్వ్ అయ్యాడో ఏమో కాని తాజాగా కొత్త సంవత్సరం సందర్బంగా బుల్లెట్ బైక్ పై రోడ్డుపై సోలోగా డ్రైవ్ చేసుకుంటూ దూసుకు పోయాడట. హెల్మెట్ పెట్టుకుని, ముఖానికి మాస్క్ వేసుకుని కేవలం కళ్ల వరకు ఓపెన్ ఉంచుకుని బండిపై అర్జున్ రెడ్డి తరహాలో షార్ట్ పై రైడ్ చేశాడు.
‘కబిర్ సింగ్’ సినిమాలో షాహిద్ కపూర్ పాత్ర అలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో హిందీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అర్జున్ రెడ్డి తమిళంలో కూడా రీమేక్ అవుతుంది. కాని హిందీలోనే ఈ చిత్రం అత్యధికంగా క్రేజ్ ను కలిగి ఉంది. హిందీలో యూత్ ఆడియన్స్ ను టార్గెట్ చేసేలా ‘కబీర్ సింగ్’ లో ఇంకాస్త మసాలా ఎలిమెంట్స్ దట్టిస్తున్నట్లుగా తెలుస్తోంది.