Begin typing your search above and press return to search.
హ్యాపీలీ మ్యారీడ్: పిల్లోడు పెళ్లాడేశాడే
By: Tupaki Desk | 7 July 2015 5:52 PM GMTచాక్లెట్‌బోయ్ కం లవర్‌బోయ్ షాహిద్ కపూర్ ఓ ఇంటివాడైపోయాడు. ఢిల్లీ అమ్మాయి మీరా రాజ్‌పుత్‌ని సంప్రదాయ పద్ధతిలో మనువాడేశాడు. వేదమంత్రాల సాక్షిగా వధువు మెడలో మూడు ముళ్లు వేసేశాడు. అయితే ముందే చెప్పుకున్నట్టు ఈ పెళ్లిలో ఎలాంటి హడావుడి లేదు. కేవలం కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో సింపుల్‌గా కానిచ్చేశారు.
కొత్త జంటను ఆశీర్వదించడానికి వచ్చిన వారిలో 'రాధా స్వామి' భక్తులు, గురువులు మాత్రం పెద్ద సంఖ్యలో కనిపించారు. వాస్తవానికి షాహిద్ కుటుంబం పూర్వీకుల నుంచి రాధాస్వామి (ఇదో పాపులర్ మతం) సత్యంగ్ భక్తులు. అందుకే గురుద్వార్ తరహాలో చాలా సాదాసీదాగా ఈ పెళ్లిని కానిచ్చేశారు. ఇదిగో వధువు సహా మొదటి ఫోటో బైటికి వచ్చేసింది. భార్య మీరాతో, అత్తగారితో కలిసి షాహిద్ ఫోటోకి ఫోజిచ్చాడిలా.
హీరోని అల్లుడిని చేసుకున్నందుకు ఆ కుటుంబం, లవర్‌బోయ్‌ని కట్టేసుకున్నందుకు మీరా తెగ మురిసిపోతున్నారు. సిగ్గులు మొగ్గలవుతున్న వేళ ఇది. కొత్త పెళ్లి కూతురు బుగ్గలు చిల్లులు పడిపోతున్నాయి. తెల్లరంగు కుర్తాలో పెళ్లికొడుకు, డీసెంట్ డిజైనర్ శారీలో పెళ్లి కూతురు ఎంత సింపుల్‌గా కనిపిస్తున్నారో కదూ? దటీజ్ సత్సంగ్ ఆచార్.