Begin typing your search above and press return to search.

57 వ‌య‌సులో 'మిష‌న్ ఇంపాజిబుల్' సాధ్య‌మా?

By:  Tupaki Desk   |   2 Dec 2022 11:30 PM GMT
57 వ‌య‌సులో మిష‌న్ ఇంపాజిబుల్ సాధ్య‌మా?
X
కింగ్ ఖాన్ షారూక్ మూడున్న‌ర ద‌శాబ్ధాల కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్లు రికార్డ్ బ్రేకింగ్ సినిమాల్లో న‌టించాడు. బాలీవుడ్ లో న‌ట‌శిఖ‌రం అన్న పేరు తెచ్చుకున్నాడు. రెడ్ చిల్లీస్ ఎంట‌ర్ టైన్ మెంట్ పేరుతో వేల కోట్ల సామ్రాజ్యాన్ని విస్త‌రించాడు. అయితే ఇన్నేళ్ల‌లో తాను ఎన్న‌డూ స‌రైన యాక్ష‌న్ సినిమా చేయ‌లేద‌ని కింగ్ ఖాన్ అన్నారు. అంతేకాదు యాక్ష‌న్ సినిమా చేస్తాన‌ని అడిగినా త‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ని కూడా వ్యాఖ్యానించారు.

దాదాపు ఐదు సంవత్సరాల గ్యాప్ త‌ర్వాత షారూక్ ఇప్పుడు యష్ రాజ్ ఫిల్మ్స్ 50వ వార్షికోత్సవంలో భాగంగా తెర‌కెక్కిస్తున్న‌ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'పఠాన్'లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రానికి వార్ ఫేం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజా ఇంట‌ర్వ్యూలో షారూక్ చేసిన ఓ కామెంట్ వైర‌ల్ గా మారింది. ' పఠాన్' రాకముందు యాక్షన్ చిత్రాల కోసం తనను ఎవరూ సంప్రదించలేదని ఖాన్ ఓపెన‌య్యారు.

తాను నిజానికి 'మిషన్ ఇంపాజిబుల్' తరహా సినిమాలు చేయాలనుకుంటున్నానని కానీ ఎవ‌రూ అలాంటి క‌థ‌లు త‌న‌కోసం రాయ‌లేద‌ని అన్నారు. దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే స్పెషల్ స్క్రీనింగ్ కోసం సౌదీ అరేబియాలో జరిగిన రెడ్ సీ ఫెస్టివల్ కు షారూఖ్ ఖాన్ గురువారం హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా 'పఠాన్' గురించి ఖాన్ ప్ర‌ఖ్యాత‌ డెడ్ లైన్ తో మాట్లాడాడు. అతను యాక్షన్ సినిమాలు ఎందుకు చేయాలనుకుంటున్నాడు? అన్న ప్ర‌శ్న‌కు..''నేను ఎప్పుడూ యాక్షన్ ఫిల్మ్ చేయలేదని.. నిజానికి అంద‌మైన ప్రేమ‌క‌థా చిత్రాలు... కొన్ని సోషల్ డ్రామాలు చేసాను'' అని అన్నారు. హీరోగా నేను కొంతమందిని చెడ్డవాళ్లను చేసాను.. కానీ ఎవరూ నాకు యాక్షన్ సినిమాల్లో అవ‌కాశాలివ్వ‌లేదు!'' అని త‌నదైన శైలిలో వ్యాఖ్యానించారు.

''నా వయస్సు 57 సంవత్సరాలు. కానీ మునుముందు నేను యాక్షన్ చిత్రాలు చేయాలని అనుకున్నాను. మిషన్ ఇంపాజిబుల్ తరహా చిత్రాలను చేయాలనుకుంటున్నాను. నేను ఓవర్‌ ది టాప్‌ యాక్షన్‌ సినిమాలే చేస్తాను'' అని బాద్ షా అన్నారు.

విదేశీ గ‌డ్డ‌పై భార‌త్ వినోద‌రంగ అభివృద్ధి గురించి ఖాన్ ఆస‌క్తిక‌రంగా మాట్లాడారు. టెక్నాలజీ పరంగా భారతదేశం భారీగా అభివృద్ధి చెందుతోందని షారుఖ్ ఖాన్ అన్నారు. ''మేం చాలా వేగంగా ముందుకు సాగామని నేను అనుకుంటున్నాను.. ప్ర‌స్తుత సాంకేతికత‌ను స‌ద్వినియోగం చేయాల‌నుకుంటున్నాను'' అని ఖాన్ వ్యాఖ్యానించారు.

'పఠాన్' సినిమాని తాను ఎందుకు చేయాలనుకుంటున్నాడో షారూక్ వెల్లడించాడు. ''మేం పఠాన్ షూటింగ్ ప్రారంభించినప్పుడు అది చాలా సరదాగా అనిపించింది. సెట్ల‌లో అద్భుతమైన సాహ‌సాలు చేశాం. నేను 30 ఏళ్లుగా చేయాలనుకున్న సినిమా ఇది. నేనెప్పుడూ కొన్ని కూల్ యాక్షన్ స్టఫ్ ఉన్న క‌థ‌ల్లోనే చేయ‌గ‌ల‌న‌ని భావించాను. కాబట్టి పఠాన్ పై నా అభిప్రాయం ఏమిటని ప్ర‌శ్నిస్తే.. న‌టుడ‌వ్వ‌డం కోసం మొదట ముంబైకి వచ్చినప్పుడు నేను నిజంగా ఏం చేయాలనుకున్నానో 'పఠాన్‌'తో అది సాధించానని ఆశిస్తున్నాను'' అన్నారు. ఖాన్ తన 20 ఏళ్ళ వయసులో యాక్షన్ హీరో కావాలనుకున్నానని ఒప్పుకున్నాడు కానీ.. తన 50 ఏళ్ళలో కూడా ఇలాంటి భారీ సాహ‌సాన్ని ఆస్వాధిస్తున్నాన‌ని ఆనందం వ్య‌క్తం చేసారు.

''నేను ఈ సినిమా చేసేప్పుడు ప్ర‌తిదీ ఆస్వాధించాను. యాక్షన్ స్టంట్స్ చేయడం సరదాగా ఉంటుంది. దీపికా పదుకొణె- జాన్ అబ్రహం- అశుతోష్ రానాలతో కూడిన యాక్షన్ చిత్రం ఇది'' అని ఆయన వివరించారు'' అని అన్నాడు. అయితే త‌న‌దైన బాణిలో చిలిపిగా మాట్లాడుతూ.. ''కొంచెం ఆలస్యమైంది (అతని వయస్సును సూచిస్తూ)... 56 సంవత్సరాల వయస్సులో కాబ‌ట్టి!'' అని త‌న‌దైన సిగ్నేచ‌ర్ స్మైల్ ని ఖాన్ ఇచ్చారు. అయినా కానీ నేను మాకో .. చాలా దృఢంగా ఉన్నాను. సాహ‌సాలు చేయ‌డానికి వెన‌కాడ‌ను. సిద్ధార్థ్ అత‌డి యాక్షన్ టీమ్ అంతా చాలా కష్టపడ్డారు. ఇది వ‌ర్క‌వుట‌వుతుంద‌ని ఆశిస్తున్నాను'' అని అన్నారు.

సిద్ధార్థ్ నాకు చాలా సినిమాలకు కథలు చెప్పడం గుర్తుంది. దురదృష్టవశాత్తూ మేం సంవత్సరాల తరబడి క‌లిసి ప‌ని చేయ‌లేక‌పోయాం. అతనితో 'పఠాన్' అనే బిరుదు ఉంది. అతను నాకు చెప్పేవాడు.. ''సర్.. మైనే ఫిల్మ్ రెడీ కర్లీ హై''.. ఒక మంచి రోజు.. అతను చెప్పిన రెండు స్క్రిప్ట్ ల్లోను నేను పని చేయలేన‌ని చెప్పినప్పుడు అతను నాకు ఒక స్వీట్ మెసేజ్ పంపాడు. అందులో ''నా దగ్గర ఈ టైటిల్ ఉంది. మీతో సినిమా తీయలేకపోయాను. ఇప్పుడు దయచేసి టైటిల్ ని తీసుకుని మీకు కావలసినప్పుడు సినిమా తీయండి'' అని సందేశం పంపాడ‌ని షారుఖ్ ఖాన్ చెప్పారు. అయితే సిద్ధార్థ్ ఆనంద్ ప‌ఠాన్ కొత్త వెర్ష‌న్ తో ఖాన్ వద్దకు తిరిగి వచ్చాడు. కార‌ణం ఏదైనా ఆ ఇద్ద‌రి క‌ల‌యిక‌కు చాలా స‌మ‌యం ప‌ట్టింది. సుదీర్ఘ ప్రయాణం త‌ర్వాతే ఇది సాధ్య‌మైంద‌ని ఖాన్ మాట‌లు వెల్ల‌డించాయి. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'పఠాన్' 2023 జనవరి 25న హిందీ- తమిళం- తెలుగులో విడుదల కానుంది!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.