Begin typing your search above and press return to search.
షారూక్ ఖాన్-కాజోల్.. మన దగ్గరే సందడి
By: Tupaki Desk | 16 Sep 2015 9:30 AM GMTముంబై మరాఠా మందిర్ లో దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే 1000 వారాలు దిగ్విజయంగా ఆడింది. ప్రపంచ సినీ యవనికపై గ్రేట్ ఇండియన్ సినిమాగా ఖ్యాతి తెచ్చుకుంది డీడీఎల్ జే . అంతటి గ్రేట్ ఇండియన్ సినిమాలో షారూక్ ఖాన్-కాజోల్ జంటగా నటించారు. మళ్లీ ఈ జోడీ కలిసి నటిస్తున్నారు అనగానే ఇంకెలాంటి మ్యాజిక్ చేస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగింది.
ప్రస్తుతం ఈ ఇద్దరి కలయికలో దిల్ వాలే ఆన్ సెట్స్ ఉంది. ప్రస్తుతం షారూక్-కాజోల్ జోడీ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో ఉన్నారు. మన సిటీలోనే సందడి చేస్తున్నారు. ఈ జోడీపై కీలకమైన ప్రేమ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ప్రేయసీ ప్రియుడు మధ్య రొమాన్స్ ని చిత్రీకరిస్తున్నారు. అయితే ఈసారి మెచ్యూరిటీ వచ్చిన ప్రేమికులు అన్నమాట. అయితే రామోజీ ఫిలింసిటీ లొకేషన్ లు డీడీఎల్ జే లొకేషన్లను మై మరిపిస్తాయా? అన్న డిష్కసన్ సాగుతోందిప్పుడు. దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే.. బ్యాక్ డ్రాప్ అంతా స్విట్జర్లాండ్ లోని అందమైన లొకేషన్ లో సాగింది. అక్కడ పచ్చని పరిసరాలు, అందమైన పూల వనాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయి. అంతేనా లండన్ లోని ప్రఖ్యాత రైల్వేస్టేషన్ లను, ఖరీదైన అద్దాల భవంతుల్ని ఈ సినిమాలో చూపించారు. ఇవన్నీ ఈ ప్రేమకథా చిత్రానికి పెద్ద ప్లస్ అయ్యాయి.
అయితే అవే గుర్తుల్ని, అదే బ్యాక్ డ్రాప్ సౌందర్యాన్ని ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీ లొకేషన్ లు తిరిగి తీసుకొస్తాయా? మెజారిటీ భాగం కీలక సన్నివేశాల్ని ఇక్కడ తెరకెక్కిస్తున్నారు కాబట్టి ఈ లొకేషన్లు నాటి మ్యాజిక్ ని రిపీట్ చేస్తాయా? అన్నది తెరపై చూడాల్సిందే.