Begin typing your search above and press return to search.
పోంజీ స్కామ్ లో సూపర్ స్టార్ పేరు
By: Tupaki Desk | 29 Jun 2017 10:58 AM GMTస్కీములు.. స్కాములలో బడా స్టార్ల పేర్లు వినిపించే సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఇలాంటి ఓ స్కీమ్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ పేరు వినిపిస్తోంది. వెబ్ ట్రేడ్ లింక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమాలపై దర్యాప్తులో షారూక్ ఖాన్ పేరు పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ట్రేడ్ లింక్స్ కు చెందిన యాడ్స్ బుక్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. కింగ్ ఖాన్ షారూక్.. నవాజుద్దీన్ సిద్ధిఖీలు యాడ్స్ బుక్ మార్కెటింగ్ కు సహకరించారని అంటున్నారు. డమ్మీ కంపెనీ వెనుక స్టార్ల పేర్లు ఉండడంతో అనేకమంది పెట్టుబడులు పెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కంపెనీ ప్రమోటర్లుగా అనురాగ్ గార్గ్.. సందేష్ వర్మలు ఉన్నారు. బాలీవుడ్ పేర్లు వినిపించడంతో.. చాలామంది భారీ మొత్తాన్నే పెట్టుబడి పెట్టేశారని.. ఈమొత్తం 500 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది.
అయితే.. ఈ పోంజీ స్కాములో షారూక్ ఖాన్ పేరు కానీ.. నవాజుద్దీన్ సిద్దిఖీని కానీ అనుమానితుల జాబితాల్లో చేర్చలేదు. ప్రస్తుతం ఈ కేసును విచారణలోకి తీసుకున్న సీబీఐ.. 2016లో ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ప్రారంభమైన ఈ కేసుపై దర్యాప్తు చేస్తోంది. బడా వ్యక్తుల పేర్లు వినిపించినంత మాత్రాన గుడ్డిగా పెట్టుబడులు చేయకూడదనే విషయాన్ని ఈ ఉదంతం చాటి చెబుతోంది. అలహాబాద్ హైకోర్టు సూచనల మేరకు.. ఈ కేసును రీ రిజిస్టర్ చేసిన సీబీఐ.. వర్మ.. అనురాగ్ గార్గ్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/