Begin typing your search above and press return to search.
అది మామూలు పార్టీ కాదు గురూ
By: Tupaki Desk | 2 Nov 2017 1:14 PM GMTసాధారణంగా హీరోలుకాని హీరోయిన్లు కాని బర్తడే పార్టీలు ఇస్తున్నారంటే.. మిగతా సెలబ్రిటీలు అందరూ మేకప్ గట్రా వేసుకుని.. హుందాగా రెడీ అయిపోయి.. ఫ్యాషన్ దుస్తుల్లో అక్కడ వాలిపోతారు. అయితే ఒకేసారి ఒకేచోట చాలామంది స్టార్లు అసలు మేకప్ లేకుండా క్యాజువల్ బట్టల్లో సోకులను ఆరబోస్తూ ఉంటే ఎలా ఉంటుంది? సరిగ్గా ముంబయ్ కు దగ్గర్లోని ఆలీబాగ్ లో అలాగే జరిగింది.
ముంబయ్ కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊరుకు.. కాస్త దూరం పడవలో వెళ్ళి.. మరికాస్త దూరంలో కారులో వెళితే.. కింగ్ ఖాన్ షారూఖ్ కొనుకున్న ప్రైవేట్ ప్రాపర్టీకి వెళ్ళొచ్చు. కేవలం షారూక్ చెప్పినోళ్ళను మాత్రమే లోపలకు పంపిస్తారు. ఈ నవంబర్ 2న తన 52వ పుట్టినరోజును జరుపుకుంటున్న బాద్షా.. ఈ ప్రాపర్టీలో తన భార్య గౌరీతో కలసి కొంతమంది పార్టీ ఇచ్చాడు. వారిలో ఫరా ఖాన్.. కరణ్ జోహార్.. కత్రినా కైఫ్.. ఆలియా భట్.. మలైకా అరోరా.. నేహా ధూపియా.. సిద్దార్ద్ మల్హోత్రాలతో పాటు.. తన కూతురు సుహానా.. ఆమె స్నేహితులు అనన్య పాండే.. షనాయా కపూర్.. కూడా ఉన్నారు. వీరందరూ కూడా మేకప్ లేకుండా పొట్టి పొట్టి దస్తుల్లో భలే జిగేల్ అన్నారు. ఈ పార్టీ ఫోటోలను చూస్తే మనకు ఆ విషయం అర్ధమవుతుంది.
అందుకే ఇప్పుడు బాలీవుడ్ ఈ పార్టీ అసలు మామూలు పార్టీ కాదు అంటున్నారు. పైగా బాలీవుడ్ కు దూరంగా.. కేవలం తనకు దగ్గరైన వ్యక్తులను మాత్రమే పిలిచి.. తనకు ఎవరు దగ్గరి వారో చెప్పకనే చెప్పాడు షారూఖ్ ఖాన్. అది సంగతి.