Begin typing your search above and press return to search.
ఆ పేరులోనే రాజసం ఉట్టిపడుతుంది
By: Tupaki Desk | 2 Nov 2015 9:30 AM GMTబాద్ షా షారుక్ ఖాన్ అంచెలంచెలుగా ఎదిగి బాలీవుడ్ లో స్టార్ హీరో హోదాను అందుకున్నారు. అప్పటికే వారసత్వం హీరోలతో బాలీవుడ్ కిటకిటలాడుతోంది. అయినా బాద్ షా సంకల్పం ముందు అవన్నీ చిన్నబోయాయి. స్వతహాగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. బుల్లి తెరపై ఓ సాదారణ నటుడిగా కెరీర్ ప్రారంభించి ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించారు. ఇంత సాధించానా ఇంకా సాధించాల్సింది చాలానే ఉందంటూ 50లోనూ పరుగులు తీస్తున్నారు. నేటితో ఆయన 50 పడి లోకి అడుగుపెట్టారు. ఈసందర్భంగా ఆయన గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు మీకోసం...
షారుక్ అంటే రాజసం ఉట్టిపడే ముఖం అని అర్ధం. ఈ పేరును ఆయన తండ్రి పెట్టారు. షారుక్ సినిమాల్లోకి రాకముందే అతని తల్లిదండ్రులు మృతిచెందారు. ఆయన చేసిన సినిమాలను...ఈ హోదాను తల్లిందండ్రులు చూడలేకపోయారేనని తరుచూ బాధపడుతుంటారు. షారుక్ తొలి సినిమా దిల్ ఆస్నా హై అవ్వాల్సింది. అయితే ఆ సినిమా విడుదల ఆలస్యమవ్వడంతో దీవానా ముందు విడుదలైంది. మాయా మేమ్ సాబ్ చిత్రం తో తర్వాత లిప్ లాక్ సన్నివేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో నటించనని ప్రకటించారు. కానీ తర్వాత జబ్ తక్ హై జాన్ సినిమాలో కత్రినతో కలసి ముద్దు సన్నివేశంలో నటించారు.
సినిమా రంగానికి ఆయన అందించిన సేవలకు గాను ఇప్పటికే చాలా అవార్డులు అందుకున్నారు.ఇటీవలే ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ కూడా అందుకున్నారు. ప్రముఖలు మైనపు విగ్రహాలను తయారుచేసి ప్రదర్శించే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం (ఇంగ్లాండ్)లో షారుక్ విగ్రహం కూడా ఉంది. షారుక్ సినిమాల్లోనే కాదు ఆటల్లోనూ నాయకుడే, జాతీయ స్థాయి జో న్ లెవెల్ పోటీల్లో హాకీ, క్రికెట్, పుట్ బాల్ జట్లకు నాయకత్వం వహించారు. ప్రస్తుతం దిల్ వాలే సినిమాలో కాజోల్ తో కలిసి మళ్లీ నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత మళ్లీ ఈ జోడి తెరపై కనిపించనుండటంతో సినిమా పై భారీ అంచనాలున్నాయి. అటు ఫ్యాన్ సినిమాలోనూ కథానాయకుడిగా నటిస్తున్నారు.