Begin typing your search above and press return to search.
కింగ్ ఖాన్ నోరు విప్పాడు
By: Tupaki Desk | 10 Jun 2017 10:21 AM GMTబాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనకు బాగా పేరు తెచ్చిన రొమాంటిక్ జోనర్ లో లేటెస్ట్ సినిమా చేస్తున్నాడు. రబ్ నే బనాదీ జోడితో తాను వెండితెరకు పరిచయం చేసిన అనుష్క శర్మతో మరోసారి జంట కట్టి జబ్ హ్యారీ మెట్ సెజల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తయింది. దీనిని ఆగస్టు 11న థియేటర్లలోకి తీసుకురావాలని ముందుగా అనుకున్నారు. ఇదే రోజున అక్షయ్ కుమార్ సినిమా టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ రిలీజ్ కానుంది. దీంతో రెండు పెద్ద సినిమాల మధ్య క్లాష్ తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో ఇంతవరకు రెండు సినిమాల ఫిలిం మేకర్లు సైలెంట్ గా ఉండిపోయారు.
ఈ సైలెన్స్ ను చివరకు బ్రేక్ చేస్తూ కింగ్ ఖాన్ నోరు విప్పాడు. తన సినిమా జబ్ హ్యామీ మెట్ సెజల్ సినిమాను ఆగస్టు 11కు బదులుగా ఆగస్టు 4నే విడుదల చేయబోతున్నట్లు చెప్పాడు. ‘‘ఆగస్టు 4న రావడం ద్వారా రక్షాబంధన్ సెలవు ఈ సినిమాకు ప్లస్ పాయింటవుతుంది. తర్వాత రెండోవారంలో ఆగస్టు 15 సెలవు కలిసొస్తోంది. రెండు వీకెండ్లకు సెలవు తోడవడంతో మంచి కలెక్షన్లే వస్తాయి. నిజాయతీగా చెప్పాలంటే సినిమాకు మంచి కలెక్షన్లు రావాలంటే 3 నుంచి 4 వేల స్ర్క్రీన్లు ఉండాలి. అదే ఇంకో పెద్ద సినిమాతో పోటీ పడితే 2 వేల స్క్రీన్లకు మించి దొరకవు. అప్పుడు సినిమా ఎంత బాగున్నా కలెక్షన్లు తక్కువే వస్తాయి.’’ అంటూ షారూఖ్ చెప్పుకొచ్చాడు.
‘వేరే సినిమాలతో రిలీజ్ డేట్ క్లాష్ వచ్చినప్పుడు ఏ మాత్రం వీలైనా నా సినిమా డేట్ మార్చుకోవడానికి ఇబ్బంది పడను. అందులో తప్పేమీ లేదు. దానివల్ల ఇద్దరూ ఆనందంగా ఉంటారు. కొన్నిసార్లు ఒక డేట్ ఫిక్సయ్యాక మార్చుకోవడం కుదరదు. అప్పడు అదే డేట్ కు సినిమా రిలీజ్ చెయ్యక తప్పదు. ఇంతకు ముందు నాకలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.’’ అని షారూఖ్ తన ఒపినీయన్ ను ఓపెన్ గా చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/