Begin typing your search above and press return to search.

హీరోయిన్స్ విషయంలో డైరెక్టర్స్ కి సూపర్‌ స్టార్స్ కండీషన్స్‌ మీద కండీషన్స్‌

By:  Tupaki Desk   |   23 July 2022 1:30 AM GMT
హీరోయిన్స్ విషయంలో డైరెక్టర్స్ కి సూపర్‌ స్టార్స్ కండీషన్స్‌ మీద కండీషన్స్‌
X
బాలీవుడ్ బాద్ షా, సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ కమర్షియల్‌ సక్సెస్‌ దక్కించుకుని దశాబ్దకాలం అయ్యి ఉంటుంది. ఈయన చివరగా జీరో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ స్థాయికి పడి పోయాడు. జీరో తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్నాడు.. దానికి తోడు కరోనా వల్ల తదుపరి సినిమాకు చాలా గ్యాప్ వచ్చింది. ఎట్టకేలకు పఠాన్‌ మరియు జవాన్ సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు.

జీరో మరియు అంతకు ముందు సినిమా లు షారుఖ్‌ ఖాన్‌ లో చాలా మార్పులు తెచ్చాయని బాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక నుంచి తన సినిమాలో హీరోయిన్ ఎంపిక మొదలుకుని ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నాడట. జీరో వరకు పూర్తిగా దర్శకుడి ఆలోచన అనుసారంగా వెళ్లిన షారుఖ్‌ ఇన ఉండి తాను ఇన్వాల్వ్‌ అవ్వాలనుకుంటున్నాడట.

దర్శకులకు కండీషన్స్ మీద కండీషన్స్ పెడుతూ ఉన్నాడట. ముఖ్యంగా హీరోయిన్స్ విషయం లో షారుఖ్‌ చాలా జాగ్రత్త లు తీసుకుంటున్నాడని సమాచారం అందుతోంది.

56 ఏళ్ల వయసు ఉన్న షారుఖ్‌ ఖాన్‌ మరీ 20.. 25 ఏళ్ల అమ్మాయిలతో రొమాన్స్ చేయడం ను ఇష్టపడటం లేదట. మినిమంగా 30 ఏళ్లకు పైగా ఉన్న వాళ్లని మాత్రమే తన సినిమాల్లో హీరోయిన్‌ లుగా నటింపజేయాలని దర్శకులకు కండీషన్ పెట్టాడట.

ఇక సినిమా కథలో భాగంగా తనను పాతికేళ్ల కుర్రాడిగా.. కాలేజ్ కుర్రాడిగా చూపించడాన్ని కూడా షారుఖ్‌ ఒప్పుకోవడం లేదట. అలా దర్శకులకు షారుఖ్‌ కండీషన్స్ మీద కండీషన్స్ పెడుతూ ఇక మీద జనాల్లో చిన్నతనం కాకుండా జాగ్రత్త పడుతున్నారట.

వరుసగా సినిమాల్లో నటించబోతున్న షారుఖ్‌ ఖాన్‌ తన వయసుకు తగ్గట్లుగా నటించాలని.. తన వయసుకు తగ్గట్లుగా స్క్రిప్ట్‌ లను ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నాడు. పఠాన్ మరియు జవాన్ లు కూడా ఆ తరహా లోనే హీరోయిన్స్ ను ఎంపిక చేసుకుని.. తన వయసుకు తగ్గట్లుగా కథలతో వాటిని చేస్తున్నట్లు తెలుస్తోంది.