Begin typing your search above and press return to search.
పాక్ లో బాలీవుడ్ బాద్ షా సోదరి మరణం
By: Tupaki Desk | 29 Jan 2020 10:18 AM GMTబాలీవుడ్ బాద్షాగా అభివర్ణించే షారూక్ ఖాన్ సోదరి 52 ఏళ్ల నూర్ జెహాన్ మరణించిన వైనం తాజాగా బయటకు వచ్చింది. షారూక్ సోదరి పాక్ లోనే స్థిరపడ్డారు. షారూక్ కు పినతండ్రి కుమార్తె నూర్. వీరు పాకిస్తాన్ లోని పెషావర్ లోని కిస్సా ఖ్వానీ బజార్ సమీపంలోని మొహల్లా షా వాలి కతాల్ ప్రాంతంలో నివసిస్తుంటారు.
కొద్ది కాలంగా నోటి క్యాన్సర్ తో బాధ పడుతున్న ఆమె.. మంగళవారం తుదిశ్వాస విడిచిన వైనం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఆమె మరణాన్ని నూర్ భర్త ఆసిఫ్ బుర్హాన్.. సోదరుడు మన్సూర్ అహ్మద్ ధ్రువీకరిస్తున్నారు. నూర్ కుటుంబంతో షారుక్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నూర్ కు భారత్ లో బోలెడంతమంది బంధువులు కూడా ఉన్నట్లు చెబుతారు.
ఆమె కోసం షారూక్ 1997లో ఒకసారి.. 2011లో మరోసారి పాక్ కు వెళ్లారు. షారుక్ తో నూర్ దిగిన ఫోటోలు ఇప్పుడు పాకిస్తాన్ లోని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నూర్ పాక్ స్థానిక రాజకీయాల్లోరాజకీయ నేతగా కొంతకాలంగా పని చేశారు. జెహాన్ జిల్లాతో పాటు పట్టణంలోనూ స్థానిక సంస్థల్లో ఎన్నికయ్యారు. తర్వాతి కాలంలో అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసిన ఆమె ఉపసంహరించుకున్నారు. సోదరి మరణంపై షారూక్ అధికారికంగా స్పందించలేదు.