Begin typing your search above and press return to search.

కూల్ వెద‌ర్ నే వేడెక్కించిన షారుక్ స్వీట్ డాట‌ర్!

By:  Tupaki Desk   |   22 Jun 2022 2:30 PM GMT
కూల్ వెద‌ర్ నే వేడెక్కించిన షారుక్ స్వీట్ డాట‌ర్!
X
షారుక్ ఖాన్ గారాల ప‌ట్టి సుహానా ఖాన్ బాలీవుడ్ ఎంట్రీకి ముందే ఇన్ స్టా వేదిక‌గా చెల‌రేగుతోన్న వైనం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సెలబ్రిటీ అభిమానులందరికీ ఆమె ఫ్యాషన్ సెన్స్ గురించి తెలిసిందే. ఫ్యాషన్ ఎంపిక‌ల్లో సుహానా మార్క్ ఎక్క‌డైనా..ఎప్పుడైనా త‌ప్ప‌ని స‌రి. డిన్నర్ పార్టీ డ్రెస్ అయినా.. స్కర్ట్‌లో అయినా బాడీకాన్ ఫిట్‌ని సుహానా ఎంతో ఇష్ట పడుతుంది. తాజాగా మ‌రోసారి స్కిన్ టైట్ దుస్తుల్లో మంట‌లు రేప‌డం నెట్టింట‌ చ‌ర్చ‌కొస్తుంది.

ప్ర‌స్తుతం వాతావ‌ర‌ణ‌మంతా చ‌ల్ల‌బ‌డుతోన్న వేళ ముంబైలో వర్షం కురిసి వేళ రోజున సుహానా ఇలా ఖాన్ ఇలా స్కిన్ టైట్ దుస్తుల్లో వీధుల్నే ఎరుపెక్చించింది. టాప్ లో టౌప్ టోన్డ్ స్పోర్ట్స్ కి మ్యాచింగ్ గా దానిపై లేత గోధుమరంగు స్వెటర్ ధరించింది. దానికి బటన్-డౌన్ ఫ్రంట్ - క్వార్టర్ స్లీవ్‌లు అమ్మ‌డి అందాన్ని మ‌రింత ఫోక‌స్ చేస్తున్నాయి.

హై వెయిస్ట్ టౌప్ టైట్స్‌తో జత చేసింది. దుస్తులకు నార్మ్‌కోర్ టచ్ అప్ ఇచ్చింది. టైట్స్‌పై ధరించిన‌ బూడిద రంగు సాక్స్.. బ్లాక్ అండ్ వైట్ గూచీ స్లైడర్‌లతో ధరించింది. వీటి ధర సుమారు రూ. 20000 ఉంటుందిట‌. తలపై నల్లటి సన్ గ్లాసెస్‌ని టక్ చేసింది - ఫినిషింగ్ టచ్ కోసం లేత గోధుమరంగు టోన్ ఉన్న లూయిస్ విట్టన్ షోల్డర్ బ్యాగ్‌ని ఎంపిక చేసుకుంది.

ఇలాంటి ఫ్యాష‌న్ ఎంపిక‌ల్లో స‌హానా మ‌రింత అందంగా క‌నిపిస్తుంద‌ని మ‌రోసారి ప్రూవ్ అయింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. అభిమానులు హాట్ కామెంట్ల‌తో ఆ వేడిని ఏమాత్రం త‌గ్గించ‌లేదు.

సుహానా బాలీవుడ్ ఎంట్రీకి ముందే ఈ రేంజ్ లో ఫ్యాష‌న్ ఐకానిక్ గాళ్ గా వెలిగిపోతుందంటే? మ్యాక‌ప్ వేసుకున్న త‌ర్వాత అమ్మ‌డు ఇంకే రేంజ్ లో మంట‌లు పుట్టిస్తుందో చె ప్పాల్సిన ప‌నిలేదు.

సుహానా ఖాన్ తెరంగేట్ర విశేషాలకు వస్తే.. ఆర్చీస్ స్ఫూర్తితో నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందిస్తున్న ఓ చిత్రంతో సుహానా బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతోంది. 'గల్లీబోయ్స్' ఫేం జోయా అక్తర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే చిత్రంతో ఖుషీ కపూర్ ... అగస్త్య నంద .. జహాన్ కపూర్ కూడా తెరకు పరిచయమవుతుండడం విశేషం. ఇది ఒక మ్యూజికల్ డ్రామా నేపథ్యంలో సాగనుంది.