Begin typing your search above and press return to search.
బాద్ షా సినిమా వస్తోంది.. తెలుసా అసలు?
By: Tupaki Desk | 24 Nov 2016 10:30 PM GMTఅమితాబ్ బచ్చన్ శకం ముగిశాక బాలీవుడ్లో ఎక్కువ కాలం నెంబర్ వన్ గా కొనసాగిన హీరో షారుఖ్ ఖాన్. బాలీవుడ్ బాద్ షా అని.. కింగ్ ఖాన్ అని షారుక్ కు బిరుదులు ఊరికే రాలేదు. ఆ స్థాయిలో అతను బాక్సాఫీస్ ను ఏలాడు. ఐతే గత దశాబ్ద కాలంలో షారుఖ్ ఖాన్ జోరు తగ్గిపోయింది. అదే సమయంలో అమీర్ ఖాన్.. సల్మాన్ ఖాన్ దూసుకెళ్లిపోయారు. అమీర్ షారుఖ్ కు అందనంత ఎత్తులో ఉండగా.. సల్మాన్ కూడా అతణ్ని దాటి వెళ్లిపోయాడు.
వరుసగా చెత్త సినిమాలు చేయడం ద్వారా ఇమేజ్ దెబ్బ తీసుకున్నాడు షారుఖ్. పబ్లిసిటీ జిమ్మిక్కులతో కొన్ని సినిమాలకు కలెక్షన్లయితే వచ్చాయి కానీ.. అతడి క్రెడిబిలిటీ మాత్రం బాగా దెబ్బ తింది. ఈ ప్రభావం ‘ఫ్యాన్’ లాంటి మంచి సినిమా మీద కూడా పడింది. ఆ సినిమాకు దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. ‘ఫ్యాన్’ తర్వాత వస్తున్న షారుఖ్ సినిమా ‘డియర్ జిందగీ’ పరిస్థితి కూడా ఏమంత ఆశాజనకంగా కనిపించట్లేదు. ప్రోమోస్ అవీ చూస్తే ఇది మంచి సినిమాలా.. వైవిధ్యమైన చిత్రంలాగా కనిపిస్తోంది కానీ.. మామూలుగా షారుఖ్ సినిమాలకు ఉండే హైప్ దీనికి లేదు. ఈ శుక్రవారం ఈ సినిమా రిలీజవుతున్న సంగతి రెగ్యులర్ సినీ గోయర్స్ కు తెలియట్లేదు.
షారుఖ్ సినిమా అంటే సౌత్ ఇండియాలో కూడా హంగామా ఉంటుంది. చర్చ నడుస్తుంది. బుకింగ్స్ జోరుగా ఉంటాయి. కానీ షారుఖ్ వరుస ఫ్లాపుల దెబ్బకు తోడు.. ఇది మరీ క్లాస్ సినిమాలా ఉండటం ప్రతికూల ప్రభావం చూపిస్తున్నట్లుంది. ఐతే కాస్త ఆలస్యంగా అయినా.. షారుఖ్ మేలుకుని ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు వైవిధ్యమైన సినిమాలు చేస్తుండటం మంచి పరిణామమే. మున్ముందు అయినా.. మళ్లీ అతడి మార్కెట్ పుంజుకునేందుకు అవకాశముంటుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/