Begin typing your search above and press return to search.

20 ఏళ్ల తర్వాత కూడా సేమ్‌ ప్రేమ

By:  Tupaki Desk   |   20 Oct 2015 2:44 PM GMT


అక్టోబర్ 20, 1995న రిలీజైన దిల్ వాలే దుల్హనియే లేజాయేంగే.. భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే మధురమైన ప్రేమకథా కావ్యం. తెలుగులో ప్రేమించి పెళ్లాడుతా అనే టైటిల్ తో రిలీజ్ అయిన ఈ మూవీ.. ఇక్కడ కూడా మంచి హిట్ నే సాధించింది. డీడీఎల్ రిలీజ్ అయ్యి 20ఏళ్లు పూర్తైన సందర్భంగా.. హీరోహీరోయిన్స్ అయిన షారూక్ - కాజోల్ లు.. ఆ మధుర స్మృతులు గుర్తు చేసుకోవడమే కాదు.. జనాలకు కూడా గుర్తు చేశారు ఓ వీడియో ద్వారా.

నీకా సినిమా గుర్తుందా అంటూ కాజల్ అడగడంతో వీడియో ప్రారంభమైతే.. డీడీఎల్ పేరు తప్ప అనీ చెబ్తూ ఏడిపిస్తాడు షారుక్. తర్వాత సోనూరీటా అంటూ ఎమోషనల్ డైలాగ్స్ చెప్పి.. లవ్ ఫీలింగ్ లో మునిగిపోయిన సమయంలో.. మళ్లీ ఫ్లవర్ నుంచి మొహంపై నీళ్లు చిమ్మి ఆట పట్టిస్తాడు రాజ్ మల్హోత్రా. తర్వాత అలిగిన కాజోల్ ను దగ్గరకి తీసుకుని నచ్చచెబుతాడు షారూక్ ఖాన్. 20 ఏళ్ల తర్వాత మళ్లీ డీడీఎల్ క్షణాలను గుర్తు చేస్తూ... ఔరా అనిపించారు ఈ జంట.

ఒక సినిమా ఒకే థియేటర్ లో 20 ఏళ్ల పాటు ప్రదర్శితం కావడమనే.. అబేధ్యమైన రికార్డును సృష్టించింది దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే. ముంబై మరాఠా మందిర్ లోంచి ఈ సినిమాను తీసేస్తామంటే.. కుదరదంటూ ఆ మూవీ ఫ్యాన్స్ ధర్నాలు చేసి మరీ... ప్రదర్శనలు కంటిన్యూ అయేలా చేస్తున్నారు.