Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ డౌన్ ఫాల్ దీంతో షురూ
By: Tupaki Desk | 26 Jan 2019 5:30 PM GMTబాలీవుడ్ స్టార్ హీరోగా దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న షారుఖ్ ఖాన్ ప్రాభవం మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తోంది. గత రెండేళ్లుగా షారుఖ్ నటించిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూ వస్తున్నాయి. తాజాగా భారీ అంచనాల నడుమ - షారుఖ్ ప్రతిష్టాత్మకంగా తీసుకని నటించిన 'జీరో' చిత్రం బాక్సాఫీస్ వద్ద జీరోగానే మిగిలింది. ఒక స్టార్ హీరో సినిమా స్థాయిలో కాకుండా ఒక కొత్త హీరో సినిమా స్థాయిలో కూడా వసూళ్లు రాలేదు. దాంతో షారుఖ్ తో సినిమాలను నిర్మించేందుకు నిర్మాతలు వెనుకంజ వేస్తున్నారు.
'జీరో' చిత్రం సమయంలోనే షారుఖ్ ప్రధాన పాత్రలో రాకేష్ శర్మ జీవిత చరిత్రతో 'సారే జహాసే అచ్చా' అనే చిత్రాన్ని చేయాలని భావించారు. ఇప్పుడు ఆ సినిమా నుండి షారుఖ్ ఖాన్ ను తప్పించారు. రాకేష్ శర్మ 35 ఏళ్ల వయస్సు లో సినిమా కథ నడుస్తుంది. 35 ఏళ్ల వయసు వ్యక్తిగా షారుఖ్ ఖాన్ సరిగా సూట్ అవ్వడం లేదు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు షారుఖ్ ఖాన్ ను పక్కన పెట్టేసినట్లుగా తెలుస్తోంది. షారుఖ్ స్థానంలో కొత్త కుర్రాడు విక్కీ బెటర్ ను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
షారుఖ్ ఖాన్ స్టార్ డం తగ్గిందనడానికి ఇదే నిదర్శణం. గతంలో షారుఖ్ సినిమాలు ఫ్లాప్ అయినా కూడా మంచి ఓపెనింగ్స్ అయితే దక్కేవి. ఒకప్పుడు ఓవర్సీస్ లో షారుఖ్ ఖాన్ సినిమాలు తెగ వసూళ్లను రాబట్టేవి. బాలీవుడ్ లో ఒకప్పుడు అత్యధిక ఓవర్సీస్ మార్కెట్ ఉన్న హీరోగా షారుఖ్ పేరు దక్కించుకున్నాడు. కాని ఇప్పుడు ఓవర్సీస్ లో షారుఖ్ సినిమాను కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆసక్తి చూపక పోవడంతో బలవంతంగా తక్కువ రేటుకు సినిమాలను కట్టబెట్టాల్సిన పరిస్థితి ఉందట.
ఈ పరిణామాలన్నీ కూడా చూస్తుంటే షారుఖ్ చరిష్మా బాలీవుడ్ లో తగ్గినట్లేనంటూ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే షారుఖ్ అభిమానులు మాత్రం మరో సూపర్ హిట్ పడితే షారుఖ్ ఇండస్ట్రీ హిట్స్ ను దక్కించుకోవడం ఖాయం అంటున్నారు. ఒక వైపు తన తోటి హీరోలు అమీర్ ఖాన్ - సల్మాన్ ఖాన్ లు దుమ్ము రేపుతూ ఇంకా దూసుకు పోతూ ఉంటే షారుఖ్ మాత్రం ప్రాభవంను కోల్పోయి మెల్ల మెల్లగా కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకున్నాడు.