Begin typing your search above and press return to search.

షారుఖ్ ను అంత మాట అనేశాడేంటి?

By:  Tupaki Desk   |   22 Dec 2015 10:30 PM GMT
షారుఖ్ ను అంత మాట అనేశాడేంటి?
X
షారుఖ్ ఖాన్ పెద్ద స్టార్ మాత్రమే కాదు.. మంచి నటుడు కూడా. షారుఖ్ సినిమాలు ఫ్లాపైనా సరే.. అందులో ఆయన నటన గురించి మాత్రం అందరూ చెప్పుకుంటారు. ఈ మధ్య చెత్త సినిమాలు చేయడం వల్ల పేరు కొంచెం దెబ్బ తిని ఉండొచ్చు కానీ.. నటుడిగా షారుఖ్ కు మంచి పేరే ఉంది. అలాంటి వాడిని పట్టుకుని ‘ఇంకెప్పుడు నటన నేర్చుకుంటావ్’ అని అడిగేశాడు ఓ వ్యక్తి. మామూలుగా మరొకరైతే తీవ్రంగానే స్పందించేవారు కానీ.. షారుఖ్ మాత్రం కూల్ గానే బదులిచ్చాడు. ‘దిల్ వాలే’ విడుదలైన నేపథ్యంలో అభిమానులతో చిట్ చాట్ సందర్భంగా జరిగిన సంభాషణ ఇది.

తమ కొత్త సినిమాలు రిలీజైనపుడు హీరోలు అభిమానులు ట్విట్టర్ లో చిట్ చాట్ చేయడం మామూలే కదా. షారుఖ్ కూడా అలాగే చేశాడు. ఐతే అందరూ షారుఖ్ ను ఆకాశానికెత్తేస్తుంటే ఒక వ్యక్తి మాత్రం ఇంకెప్పుడు నటన నేర్చుకుంటావ్ అని అడిగేశాడు. దీనికి బదులుగా షారుఖ్.. నటుడిగా కొనసాగేందుకు ప్రత్యేకంగా ఎలాంటి ఫార్ములాలు ఉండవని, చనిపోయేవరకు కూడా నటనను నేర్చుకోలేనని అన్నాడు. షారుఖ్ ఆవేశపడిపోకుండా ఇలా కూల్ గా జవాబివ్వడం గొప్ప విషయమే. షారుఖ్ కు ఇలాంటి ఇబ్బందికర ప్రశ్న మరొకటి ఎదురైంది. ‘దిల్ వాలే’ తరహా సినిమాలే చేస్తూ పోతే మీకున్న అభిమానబలం తగ్గిపోక తప్పదని అతననగా.. నటుడిగా తాను ఒక మూసలో ఉండిపోనని.. అన్ని రకాల పాత్రలు చేస్తానని షారుఖ్‌ సమాధానమిచ్చాడు.