Begin typing your search above and press return to search.
బాలీవుడ్ బాద్ షా.. ఆ ట్యాగ్ తీసేయండబ్బా
By: Tupaki Desk | 29 April 2016 7:30 AM GMTషారుఖ్ ఖాన్ పేరును ఉత్తగా పలకడం అలవాటు లేదు జనాలకు. బాలీవుడ్ బాద్ షా అని.. కింగ్ ఖాన్ అని.. పిలుచుకుంటారు అతణ్ని. ఐతే ఆ ట్యాగ్ లు ఊరికే వచ్చేయలేదు షారుఖ్ ఖాన్ కు. ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచిపోయే హిట్లిచ్చాడు అతను. ఫ్లాప్ సినిమాలతో సైతం కలెక్షన్ల వర్షం కురిపించడం అతడికే చెల్లింది. కానీ ఆ మేనియా గత కొన్నేళ్లలో క్రమ క్రమంగా తగ్గిపోయి.. ఇప్పుడు పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు వంద కోట్లయినా కలెక్ట్ చేయలేని పరిస్థితికి చేరుకున్నాడు షారుఖ్. రెండు వారాల కిందట భారీ అంచనాల మధ్య రిలీజైన షారుఖ్ కొత్త సినిమా ‘ఫ్యాన్’ డిజాస్టర్ అని తేలిపోయింది. ఇప్పటిదాకా ఈ సినిమా కేవలం రూ.80 కోట్లు మాత్రమే వసూలు చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
గత కొన్నేళ్లలో చాలా చెత్త చెత్త సినిమాలు చేశాడు షారుఖ్. ఐతే ప్రతి సినిమాకూ హైప్ తీసుకురావడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. దీంతో ఫ్లాప్ సినిమాలకు సైతం మంచి వసూళ్లే వచ్చాయి. కానీ ‘ఫ్యాన్’ లాంటి కంటెంట్ ఉన్న జెన్యూన్ సినిమా చేస్తే మాత్రం జనాలు ఆదరించలేదు. ఈ సినిమాకు చాలా మంచి రివ్యూలు రావడంతో కనీసం 200 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేశారు.
కానీ వంద కోట్ల మార్కును టచ్ చేయడానికి కూడా చాలా కష్టపడుతోందీ సినిమా. ‘ఫ్యాన్’ థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తయింది. కాబట్టి ఇక కలెక్షన్లపై పెద్దగా ఆశలు పెట్టుకోవడానికి లేదు. గత దశాబ్ద కాలంలో షారుఖ్ చేసిన మంచి సినిమా అన్న ముద్ర మాత్రం మిగిలింది చివరికి. ఈ సినిమా రిజల్ట్ చూశాక.. కింగ్ ఖాన్.. బాద్ షా.. లాంటి ట్యాగ్ లైన్లు తీసేయాలంటూ యాంటి ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు షారుఖ్ అభిమానుల మీద.