Begin typing your search above and press return to search.
మావాడు నాకంటే ఫేమస్
By: Tupaki Desk | 12 Nov 2015 5:28 AM GMTసరోగసి పద్ధతిలో బిడ్డను కని సెన్సేషన్ క్రియేట్ చేశాడు షారూక్ ఖాన్. కృత్రిమ గర్భం నుంచి వచ్చిన ఆ బిడ్డకు ఎబి రామ్ (అబ్రమ్ అని పిలుస్తున్నారు)అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుతున్నాడు. పసిబిడ్డకు కనీసం కెమెరా ఫ్లాష్ కూడా తాకకుండా జాగ్రత్తపడుతున్నాడు. పబ్లిక్ అప్పియరెన్స్ ని పూర్తిగా రిస్ర్టిక్ట్ చేశాడు. అయితే ఆ బిడ్డ కాలక్రమంలో ఎదిగి పెద్దవాడవుతున్నాడు. అతడిపై మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంటే నాకంటే ఎక్కువ ఫేమస్ అయిపోయేట్టున్నాడు. అందుకే బైటికి తేవడం లేదని షారూక్ ఇటీవల చెప్పుకొచ్చాడు..
ప్రస్తుతం అతడు నటించిన క్రేజీ మూవీ దిల్ వాలే త్వరలోనే రిలీజ్ కి వస్తోంది. ఈ సందర్భంగా ఇంటా బైటా బోలెడంత ప్రచారం చేసేస్తున్నాడు. తన కోస్టార్స్ కాజోల్ - వరుణ్ ధావన్ - కృతి సనోన్ లతో కలిసి ప్రమోషన్ యాక్టివిటీస్ లో పాల్గొంటున్నాడు. ఈ ప్రమోషన్ లోనే బోలెడంత కామెడీ చేస్తున్నాడు బాద్ షా. తన సినిమా గురించి కంటే తన కొడుకు గురించే ఎక్కువ ప్రమోషన్ చేస్తున్నాడు. అప్పట్లో పిల్లలు వేరు. ఇప్పటి జనరేషన్ వేరు. ఈ కాలం పిల్లలు స్పీడ్ గా దూసుకుపోతున్నారు. అందుకే వీళ్లతో జాగ్రత్తగా ఉండాలి అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు షారూక్. అతడి మాటల్ని బట్టి ఇప్పట్నుంచే అబ్రమ్ ని ఎంతో కట్టుబాట్లతో పెంచుతున్నాడు అన్నది అర్థమవుతోంది కదూ?
మొన్ననే దిల్ వాలే ప్రివ్యూ షో వేశాం. చుట్టూ చిత్రయూనిట్ కూడా ఉంది. అందులో అబ్రమ్ కూడా ఉన్నాడు. ఓ స్టంట్ సీన్ లో కాజోల్ వల్ల నాక్కూడా గాయం అవుతుంది. ఆ సంగతినే మావాడు చెబుతూ.. పాపా.. టూట్ గయా.. అంటూ కాజోల్ ని చూపిస్తున్నాడు. బుడ్డోడు ఎంత ఎదిగేశాడో? అంటూ తెగ మురిపెంగా చెప్పుకున్నాడు షారూక్. పుత్రోత్సాహము ఆ సుపుత్రుని కనంగ.. అని పద్యం పాడుకోవాల్సిందే ఇక.