Begin typing your search above and press return to search.

బాబూ షారుఖ్.. ఏంటీ ఫాలోయింగ్

By:  Tupaki Desk   |   30 Dec 2015 7:30 PM GMT
బాబూ షారుఖ్.. ఏంటీ ఫాలోయింగ్
X
ట్విట్టర్ లో మన హీరో హీరోయిన్లు పది లక్షల ఫాలోయిర్ల మార్కు అందుకుంటేనే కిందా మీదా అయిపోతున్నారు. కానీ అక్కడ బాలీవుడ్ స్టార్లను చూడండి. కోట్లల్లో ఫాలోయిర్లను సంపాదించుకుని నెల నెలకూ ఫాలోయింగ్ పెంచుకుంటూ దూసుకెళ్లిపోతున్నారు. అందులోనూ బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఫాలోయింగ్ అయితే మామూలుగా లేదు. నెల కిందటి వరకు కింగ్ ఖాన్ ట్విట్టర్ ఫాలోయర్ల సంఖ్య కోటి 60 లక్షలు. ఈ నెలలో ‘దిల్ వాలే’ సినిమా రిలీజైన నేపథ్యంలో అతడి ఫాలోయింగ్ మరింత పెరిగి కోటి 70 లక్షలకు చేరింది. నెల రోజుల్లోపే పది లక్షల మంది కొత్తగా అతడి ఫాలోయర్ల జాబితాలో చేరడం విశేషం. షారుఖ్ జోరు చూస్తుంటే.. త్వరలోనే ఇండియా నెంబర్ వన్ అయ్యేలా ఉన్నాడు.

ఈ జాబితాలో ప్రస్తుతం బిగ్-బి అమితాబ్ బచ్చన్ ముందున్నారు. ఆయన వెనుక కోటి 88 లక్షలమంది ఉన్నారు. షారుఖ్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. షారుఖ్ జోరు చూస్తుంటే రాబోయే కొన్ని నెలల్లో అమితాబ్ ను దాటేసినా ఆశ్చర్యం లేదు. ఇక అమితాబ్ - షారుఖ్ తర్వాతి స్థానం ప్రధాని నరేంద్ర మోడీది కావడం విశేషం. ఆయన్ని కోటి 60 లక్షల మంది అనుసరిస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో మరో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఉన్నాడు. అతడికి కోటి 59 లక్షల మంది ఫాలోయర్లున్నారు. సల్మాన్ ఖాన్ 1.55 కోట్ల మంది ఫాలోయర్లతో అతడి వెనకే ఉన్నాడు. టాప్-10లో ఉన్న మహిళలు ఇద్దరే.. దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా. వాళ్లిద్దరికీ 1.2 కోట్లకు అటు ఇటుగా ఫాలోయర్లనున్నారు.