Begin typing your search above and press return to search.

బాహుబలి మట్టిలో మాణిక్యం -కింగ్ ఖాన్

By:  Tupaki Desk   |   16 May 2017 4:18 PM GMT
బాహుబలి మట్టిలో మాణిక్యం -కింగ్ ఖాన్
X
బాహుబలి2 ఘన విజయాన్ని కీర్తించడానికి బాలీవుడ్ కి ఇన్నాళ్లు నోరు రాలేదు. డైరెక్ట్ హిందీ సినిమాలను మించిపోయి.. ఓ తెలుగు డబ్బింగ్ సినిమా ఆడడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అయితే.. మెల్లగా ఈ షాక్ నుంచి కోలుకుంటున్న హిందీ సినిమా జనాలు ఒక్కొరొక్కరుగా నోరు విప్పుతున్నారు. మొదటగా అక్షయ్ కుమార్ బాహుబలిని ప్రశంసిస్తే.. తర్వాత వరుస క్యూ కట్టేశారు. ఇప్పుడీ జాబితాలో కింగ్ ఖాన్ షారూక్ కూడా చేరాడు.

'సక్సెస్ అనేది నెంబర్స్ తో కాదు.. విజన్ తో ఉంటుంది.. ఆలోచనతో ఉంటుంది. బాహుబలి2 మట్టిలో మాణిక్యం లాంటిది. ఈ విజయానికి బాహుబలి2 అన్ని విధాలా అర్హత కలిగి ఉంది. సినిమాలో టెక్నాలజీ ఎప్పుడూ ముఖ్యమే. అయితే.. టెక్నాలజీ లేనపుడు కూడా మంచి సినిమాలను మనం తీశాం. కానీ ఇంత పెద్ద సినిమా తీయాలన్నా.. ఇంత పెద్ద కల కనాలన్నా.. అంతటి స్టోరీ చెప్పగలమనే గట్స్ ఉండాలి. ఇది కేవలం బాహుబలి సక్సెస్ మాత్రమే కాదు. ఆయన తీసే ప్రతీ సినిమాతో రాజమౌళి ఎప్పుడూ స్ఫూర్తిని ఇస్తూనే ఉంటారు. ఇది నాతో పాటు ప్రతీ ఫిలిం మేకర్ ని ఎంతో ఇన్ స్పైర్ చేసే విషయం' అన్నాడు షారూక్ ఖాన్.

అసలు బాహుబలి2ను ఇంకా చూడకుండానే షారూక్ ఖాన్ ప్రశంసలు కురిపించడమే ఆశ్చర్యకరమైన విషయం. 'నేను బాహుబలి పార్ట్ 1 మాత్రమే చూశాను. ఇంకా రెండో భాగం చూడలేదు' అన్నాడు షారూక్.