Begin typing your search above and press return to search.
'మహావీర్ కర్ణ' పై కింగ్ ఖాన్ హ్యాండు
By: Tupaki Desk | 11 Dec 2018 5:40 AM GMT`బాహుబలి` సిరీస్ ప్రభావం అంతకంతకంతకు మార్కెట్ స్థాయిని పెంచుతోందనడానికి తాజా పరిణామాలే సాక్ష్యం. కొందరు పులిని చూసి నక్కలా వాతలు పెట్టుకుంటున్నా, మరికొందరు మాత్రం బాహుబలి స్ట్రాటజీతో బాగుపడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే డజను పైగా భారీ పాన్ ఇండియా సినిమాలు ప్రస్తుతం ఆన్‌సెట్స్ ఉన్నాయి. ఇటీవలే చియాన్ విక్రమ్ కథనాయకుడిగా ఆర్.ఎస్.విమల్ దర్శకత్వంలో ప్రారంభమైన `మహావీర్ కర్ణ` ఇదే తరహాలో బాగుపడుతోందన్నది ఇన్ సైడ్ సమాచారం. ఈ సినిమాని దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. దాదాపు భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా 36 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది ప్లాన్. న్యూయార్క్ కు చెందిన యునైటెడ్ కింగ్ డమ్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ తరహా సినిమాల వెల్లువ ట్రేడ్ మైండ్ సెట్ ని మార్చేస్తున్నాయన్నది తాజా రిపోర్ట్.
బాహుబలి తర్వాత సౌత్ సినిమాల ఒరవడిని బాలీవుడ్ ప్రముఖులు ఎంతో నిశితంగా పరిశీలిస్తున్నారు. సరిగ్గా ఇదే కారణం ప్రతిష్ఠాత్మక `మహావీర్ కర్ణ`కు కలిసొచ్చిందని విశ్లేషిస్తున్నారు. ఈ సినిమాలో పెట్టుబడులు పెట్టేందుకు హేమాహేమీలు అనదగ్గ ప్రముఖులే దిగొస్తున్నారట. ఆ క్రమంలోనే కింగ్ ఖాన్ షారూక్ ఈ చిత్రంలో తన వాటా పెట్టుబడి కోసం ఆసక్తిగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. అంతేకాదు షారూక్ ఈ చిత్రానికి టెక్నికల్ సపోర్టును ఇస్తున్నారు. అతడికి చెందిన రెడ్ చిల్లీస్ వీఎఫ్ ఎక్స్ విభాగం సాంకేతికంగా సపోర్టును అందించడం ఆసక్తికర చర్చకు తావిచ్చింది. ఖాన్ దాదా చెయ్యి పడితే ఆ సినిమా రేంజు స్కైని టచ్ చేసినట్టేనన్న మాటా వినిపిస్తోంది.
ఓవైపు కరణ్ జోహార్ లాంటి దర్శకనిర్మాత తెలివిగా సౌత్ సినిమాలపై పెట్టుబడులు పెడుతూ ఉత్తరాది మార్కెట్ నుంచి భారీగా ఆర్జిస్తున్నాడు. `బాహుబలి` సిరీస్ తర్వాత 2.ఓ చిత్రాన్ని ఉత్తరాదిన డిస్ట్రిబ్యూట్ చేసి భారీగా దండుకుంటున్నాడు. ఇది గమనించిన తర్వాత ఖాన్ ల త్రయంలోనూ ఆలోచనలు మారాయని - కింగ్ ఖాన్ షారూక్ `మహావీర్ కర్ణ` చిత్రానికి అండగా నిలిచేందుకు ఇదే కారణమని పలువురు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఒక్క సినిమాపైనే కాదు - ఇక్కడి నుంచి ఉత్తరాదిన భారీగా రిలీజ్ కి వెళ్లేందుకు అరడజను సినిమాలు రెడీ అవుతున్నాయి. అందులో కన్నడ సినిమా కేజీఎఫ్ చిత్రానికి అంతే క్రేజు నెలకొంది. దక్షిణాదిన ఎలాంటి భారీ చిత్రం ప్రారంభమైనా ఉత్తరాది చూపు ఇటువైపు పడుతుండడం మన సినిమాలకు కలిసొస్తోంది.