Begin typing your search above and press return to search.
ఆమెతో ఆ స్టార్ హీరోకి లవ్వూ..లక్ రెండూనూ!
By: Tupaki Desk | 15 July 2018 11:15 AM GMTబాలీవుడ్ బాద్ షాగా తిరుగులేని జెండాను ఎగురవేయటమే కాదు.. తనకు సమీపానికి వచ్చేందుకు మరే స్టార్ హీరోకి అవకాశం ఇవ్వని సత్తా షారూక్ సొంతం. ఎలాంటి అండ లేకుండా స్వశక్తితో పైకి వచ్చిన షారూక్ వెండితెర మీద ఎన్ని సంచలనాలు సృష్టించాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు.
తాను నచ్చి.. మెచ్చి మరీ పెళ్లాడిన గౌరీతోనూ.. పిల్లలతో గడిపేందుకు షారూక్ ఎక్కువ ఇష్టాన్ని చూపిస్తూ ఉంటారు. చాలా చిన్న వయసులోనే ప్రేమ పెళ్లి చేసుకున్న షారుక్ ను చాలామంది ఆయన పెళ్లి గురించి చాలానే అడగాలనుకుంటారు.
తాజాగా ఆ పని చేశాడో అభిమాని. ఇన్ స్టాగ్రామ్ కొత్తగా తీసుకొచ్చిన ఒక ఫీచర్ లో యూజర్ నుప్రశ్నించే వీలుంది. అయితే.. దీన్ని 24 గంటల్లో తొలగిస్తుంటారు. ఈ నేపథ్యంలో అభిమాని ఒకరు ఆసక్తికర క్వశ్చన్ ను సంధించారు. మరీ.. కుర్ర వయసులోనే ఎందుకు పెళ్లి చేసుకున్నారన్న ప్రశ్నకు షారుక్ స్పందించారు.
కాస్తంత చిలిపిగా సమాధానం ఇచ్చిన ఆయన.. బ్రదర్.. లైఫ్ లో లవ్.. లక్ రెండు కలిసి ఒకేసారి తలుపు కొట్టొచ్చు. అదే రీతిలో నాకు గౌరీ రూపంలో రెండూ ఒకేసారి వచ్చి తలుపు తట్టాయి. అందుకే.. చాలా త్వరగా పెళ్లి చేసేసుకున్నా అంటూ ఇచ్చిన సమాధానం నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. పెళ్లి అయిన ఇన్నాళ్లకు సైతం భార్య మీద షారుక్ ప్రదర్శిస్తున్న ప్రేమాభిమానాల్ని భలేగా ప్రదర్శించేశాడు కదూ!