Begin typing your search above and press return to search.
దక్షిణాది కోసం బెట్టు వీడుతున్న బాలీవుడ్
By: Tupaki Desk | 17 Jan 2023 2:30 AM GMTగత కొంత కాలంగా బాలీవుడ్ అంటే ఇండియన్ సినిమా.. ఇండియన్ సినిమా అంటే ప్రపంచ దేశాల దృష్టిలో కానీ.. హాలీవుడ్ సెలబ్రిటీల దృష్టిలో కానీ ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే. కానీ కాలం మారింది. `బాహుబలి`తో ఇండియన్ సినిమాకు అర్థం మారిపోయింది. ఈ మార్పు `బాహుబలి`తోనే మొదలైనా `RRR`తో ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మన సినిమాకు ప్రేక్షకులు, విదేశీ ప్రియులు, స్టార్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్ ఎంతగా ఫిదా అవుతున్నారో `RRR` నిరూపించింది.
మన సంస్కృతికి సంబంధించి మూలాలు బాలీవుడ్ సినిమాల్లో కనిపించడం లేదని పలువురు బాలీవుడ్ ప్రముఖులే బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్న వేళ బాలీవుడ్ కళ్లు తెరిచింది. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రేక్షకుల్ని, వారి సంస్కృతి సంప్రదాయాలకు బాలీవుడ్ సినిమాల్లో పెద్ద పీట వేసినప్పుడే మిందీ సినిమాకు మంచి రోజులొస్తాయని కాస్త ఆలస్యంగా గ్రహించింది. దీనికి ప్రత్యేక నిదర్శనమే షారుక్ ఖాన్ తను నటించిన `పఠాన్` సినిమాని ప్రమోట్ చేసుకుంటున్న తీరు.
బాలీవుడ్ గత కొంత కాలంగా ప్రాంతీయ సినిమాలని చిన్న చూపు చూసిన విషయం తెలిసిందే. ప్రాంతీయ స్టార్స్ అన్నా అదే భావనతో వున్న బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే నేల విడిచి సాము చేస్తున్నామను మార్పు మొదలైంది. తమ సినిమా దేశ వ్యాప్తంగా వున్న అన్ని ప్రాంతాల వారిని చేరాలంటే ముందు వారిని ప్రసన్నం చేసుకోవాలనే మార్పు మొదలైంది. దీనికి షారుక్ ఖాన్ శ్రీకారం చుట్టాడు.
తను నటించిన యాక్షన్ స్పై థ్రిల్లర్ `పఠాన్` జనవరి 25న భారీ స్థాయిలో హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాది వారిని కూడా ప్రసన్నం చేసుకోవాలనే ఆలోచనతో బెట్టు వీడిన షారుక్ ఖాన్ ప్రముఖ తెలుగు ఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్ లో త్వరలో ప్రసారం కానున్న సీరియల్స్ కు ప్రచారం చేస్తూ `పఠాన్` ని ప్రమోట్ చేసుకుంటుండటం గమనార్హం. గతంలో ఇలా ఏ బాలీవుడ్ స్టార్ తెలుగు సీరియల్ కు ప్రచారం చేస్తూ తన సినిమాని ప్రమోట్ చేసుకోలేదు.
కానీ ఈ సారి కొత్తగా ఓ తెలుగు సీరియల్ ని ప్రమోట్ చేస్తూ షారుక్ తన `పఠాన్` మూవీని ప్రమోట్ చేసుకుంటుండటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బిగ్ బాస్ ఫేమ్ మానస్ ప్రధాన పాత్రలో నటించిన సీరియల్ కు షారుక్ ప్రమోట్ చేయడం ఏంటని అంతా అవాక్కవుతున్నారు. దక్షిణాది వారి పట్ల బాలీవుడ్ స్టార్స్ లో వచ్చిన మార్పుని చూసి మురిసిపోతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.