Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ మార్కెట్ మరీ ఇంత డౌనా..
By: Tupaki Desk | 10 March 2017 4:59 PM GMTవ్యాపారం అన్నాక మొహమాటాలకు అస్సలు తావు ఉండదు. పేరు ప్రఖ్యాతులు ఎంతున్నా.. ఒక్కసారి మార్కెట్ డౌన్ అయ్యిందా.. ఇక అంతే. మిగిలిన రంగాల కంటే.. కర్కసత్వం పాళ్లు సినిమారంగంలో చాలా ఎక్కువగా ఉంటాయి. అప్పటి వరకూ బెల్లం చుట్టూ ముసిరిన ఈగల్లా తిరిగే వారంతా..రెండు..మూడువరుస ఫెయిల్యూర్స్ వచ్చి పడ్డాయంటే అంతే సంగతులు..తుపాకీకి కూడా అందనంత దూరానికి వెళ్లిపోతారు. ఇలాంటి అనుభవం కాకున్నా..దాదాపు ఇదే తీరులో ఉంది బాలీవుడ్ బాద్షా షారూక్ పరిస్థితి.
గడిచిన నాలుగు సినిమాలు.. ఒకదానికి మించి మరొకటి డిజాస్టర్స్ గా మారిన వేళ.. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘‘ద రింగ్’’ దారుణమైన ధర పలికింది. వాస్తవానికి షారుక్ సినిమా అంటే..ఫ్యాన్సీ ధరలకు కొనుగోలు చేయటానికి తెగ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు.అయితే.. ఆయన గత చిత్రాలన్నీ ఫెయ్యిలూర్స్ కావటంతో సీన్ మొత్తం మారిపోయింది. మొన్నటికి మొన్నరిలీజ్ అయిన రయిస్.. అంతకు ముందు వచ్చిన ఫ్యాన్.. దిల్ వాలే.. హ్యాపీ న్యూ ఇయర్ దారుణమైన పరాజయాన్ని పొందాయి.
దీంతో.. షారూక్ తాజా చిత్రం కేవలం వంద కోట్లకు కాస్త ఎక్కువగా మాత్రమే అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది. ఈ వందకోట్లకు ప్రపంచ వ్యాప్తంగా థియరిటికల్ రైట్స్ తో పాటు..శాటి లైట్.. డిజిటల్.. ఆడియోతో సహా అన్ని రైట్స్ కు ఈ మాత్రమే పలకటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. షారూక్ సినిమా ఇంత తక్కువ ధర పలకటానికి కారణం.. చిత్ర దర్శకుడు ఇంతియాజ్ అలీ అని కూడా చెబుతున్నారు. ఆయన సినిమాలన్నీ మల్టీఫ్లెక్స్ మూవీలు కావటం..షారూక్ సినిమా కూడా అలాంటి పరిస్థితే ఉంటే.. మొదటికే మోసం వస్తుందన్న ఉద్దేశంతో ఎక్కువ ధర పెట్టటానికి ఏ మాత్రం సిద్ధపడకపోవటం గమనార్హం.ఫెయిల్యూర్ ముందు.. బాద్షా అయినా బలదూరేనని మరోసారి తేలిపోయిందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/