Begin typing your search above and press return to search.

పెళ్లి గురించి రాయకుంటే జీవితకథ కాదుగా సానియా?

By:  Tupaki Desk   |   14 July 2016 3:58 AM GMT
పెళ్లి గురించి రాయకుంటే జీవితకథ కాదుగా సానియా?
X
జీవిత కథలు పుస్తకాలుగా అచ్చేయటం పాత ముచ్చటే. కాకుంటే.. ఇందులో కొత్త విషయం ఏమిటంటే.. పుస్తకాల్ని వాణిజ్య కోణంలోచూడటం. పైకి చెప్పరు కానీ.. ఆత్మకథల పేరిట ప్రముఖులు మరింత ప్రచారాన్ని పొందేందుకు ఇలాంటి పుస్తకాలు చాలానే సాయం చేస్తుంటాయి. టెన్నిస్ స్టార్ సానియామీర్జాకు ప్రత్యేకించి ప్రచారం అక్కర్లేదు కానీ.. తన జీవిత కథను నలుగురికి చెప్పుకోవాలన్న ఉత్సాహం.. దాని ద్వారా వచ్చే ఇమేజ్ ను సొంతం చేసుకోవాలని ఎవరికి ఉండదు. అందుకేనేమో.. 29 ఏళ్ల వయసుకే తన జీవితకథను పుస్తకంగా మార్చేసి అచ్చేయించుకుంది.

తన జీవిత కథలో పెళ్లితో పాటు అనేక అంశాల్ని ప్రస్తావించినట్లుగా చెప్పుకొచ్చింది. కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలు తన మీద ఉన్నాయని.. వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నూటికి నూరుశాతం ప్రయత్నించనున్నట్లుగా సానియా మీర్జా చెప్పుకొచ్చింది. తన ఆత్మకథ అయిన ‘‘ఏన్ ఎగైన్ట్స్ ఆడ్స్’’ పేరిట పుస్తకాన్ని బాలీవుడ్ బాద్షా షారూక్ తోకలిసి ఆవిష్కరించారు.

పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా పుస్తకం గురించి చెబుతూ.. తన పెళ్లితో పాటు పలు అంశాల్ని పేర్కొన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఓపక్క ఆత్మకథ అని చెబుతూ మళ్లీ పెళ్లి గురించి ప్రస్తావించానని చెప్పటంలో అర్థమేందన్నది ఒక ప్రశ్న అయితే.. 29 ఏళ్ల ప్రముఖురాలు తన ఆత్మకథను పుస్తక రూపంలో ఆవిష్కరించే సందర్భంలో సోనియా జీవిత భాగస్వామి పక్కన లేకపోవటమేమిటి చెప్మా..?